'కాటమరాయుడు' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది ముద్దుగుమ్మ శృతిహాసన్. పవన్‌తో ఈ ముద్దుగుమ్మ నటించిన 'గబ్బర్ సింగ్' సినిమా సూపర్ హిట్ అయ్యింది. అలాగే ఈ సినిమాతోనే శృతిహాసన్ లైమ్ లైట్‌లోకి వచ్చింది. అక్కడి నుండే ఆమె కెరీర్ టర్న్ అయ్యిందని అంతా అనడమే కాదు. చాలా సందర్భాల్లో శృతిహాసన్ కూడా చెప్పింది. అలాంటి పవన్ కళ్యాణ్‌తో మళ్లీ రెండోసారి నటించడం తనకి చాలా సంతోషంగా ఉందని తెలిపింది శృతిహాసన్. అయితే మామూలుగానే పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరోయిన్లు చాలా అందంగా కనిపిస్తారు. 'గబ్బర్ సింగ్'లో శృతి మరింత అందంగా కనిపించింది. కానీ డిగ్నిఫైడ్ లుక్‌లో మాత్రమే కనిపించింది. అయితే ఈ సారి శృతిహాసన్ కొంచెం గ్లామర్ డోస్ ఎక్కువ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలోని కొన్ని స్టిల్స్ చూస్తుంటే ఈ విషయం అర్ధమవుతోంది. అంతేకాదు ఈ సినిమా కోసం శృతి కొంచెం బొద్దుగా కూడా తయారయ్యిందట. అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత కూడా ఉండనుందట. ఇటీవల విడుదలైన 'సింగం 3'లో హద్దుల్లేకుండా అందాలు ఆరబోసేసింది శృతి. కేవలం గ్లామర్ కోసమే శృతి పాత్ర ఉందంటూ కామెంట్స్ కూడా వచ్చాయి. కానీ 'కాటమరాయుడు' సినిమాలో కొంచెం గ్లామరస్‌గా కనిపించినా, ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తుందట. ఏది ఏమైనా ఈ సినిమాతో మరో సారి బ్లాక్ బస్టర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకునేందుకు రెడీగా ఉన్నట్లే కనిపిస్తోంది శృతిహాసన్.