సిమ్రాన్‌ మళ్లీ వచ్చేస్తోందహో.!

మరిన్ని వార్తలు

కుర్రకారుకు కంటి మీద నిద్ర లేకుండా చేసింది ముద్దుగుమ్మ సిమ్రన్‌. తెలుగు, తమిళ భాషల్లో ఆగ్రకథానాయికగా వెలుగొందింది. దాదాపు పదేళ్ల క్రితం సిమ్రాన్‌కి తెలుగులో తిరుగే లేదు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌, నాగార్జున ఇలా అగ్ర కథానాయకుల సరసన హీరోయిన్‌గా నటించింది. సిమ్రాన్‌ కెరీర్‌లో చెప్పుకోదగ్గ సక్సెస్‌లు ఎన్నో ఉన్నాయి. 

కెరీర్‌ చివర్లో ఆమె కమెడియన్‌ కృష్ణ భగవాన్‌కి జంటగా 'జాన్‌ అప్పారావ్‌ 40 ప్లస్‌' చిత్రంలో నటించింది. ఆ తర్వాత ఆమె సినిమాలకు దూరమైంది. ఇంత లాంగ్‌ గ్యాప్‌ తర్వాత ఈ బ్యూటీ ఇప్పుడు రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. అయితే ఆల్రెడీ తమిళంలో సిమ్రాన్‌ ఎప్పుడో ఎంట్రీ ఇచ్చేసింది. ప్రస్తుతం మూడు తమిళ చిత్రాల్లో నటిస్తోంది కూడా. అయితే తెలుగులో మాత్రం ఆమె ఇంకా కనిపించలేదు. 

తాజాగా తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సరసన సిమ్రన్‌ నటించే గోల్డెన్‌ ఛాన్స్‌ దక్కించుకుంది. సూపర్‌స్టార్‌ సై అంటే ఏజ్‌తో సంబంధం లేకుండా ఆయనతో జోడీ కట్టేందుకు యంగ్‌ భామలు కూడా క్యూ కట్టేస్తారు. అలాంటిది ఆయన సరసన నటించే ఛాన్స్‌ సిమ్రాన్‌ దక్కించుకుంది. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ నటిస్తున్న చిత్రానికి సిమ్రాన్‌ని హీరోయిన్‌గా ఎంచుకున్నారనీ తెలుస్తోంది.

 

ఇంతవరకూ ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రిష పేరు బాగా వినిపించింది. కానీ ఆ ఛాన్స్‌ ఇప్పుడు సిమ్రాన్‌ని వరించడంతో మిగిలిన ముద్దుగుమ్మలు కొంచెం అసూయ చెందుతున్న మాట వాస్తవమే కానీ, ఈ సినిమాతో సిమ్రాన్‌ మళ్లీ తెలుగులో కూడా హవా కొనసాగిస్తుందేమో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS