కరోనా కారణంగా థియేటర్లకు రావాల్సిన సినిమాలన్నీ ఓటీటీలకే పరిమితం అయ్యాయి. `సోలో బతుకే సో బెటర్` కూడా ఓటీటీలోనే రావల్సింది. జీ 5 ఈ సినిమా హక్కుల్ని కొనుక్కుంది. అయితే థియేటర్లు మళ్లీ తెరచుకోవడంతో.. థియేటరికల్ రిలీజ్‌కి ఆస్కారం ఏర్పడింది. అయితే అది మంచికే అయ్యింది. తొలి మూడు రోజులూ.. `సోలో బతుకే` మంచి వసూళ్లని అందుకుంది. కరోనా సమయంలోనూ.. ఇలాంటి రాబడి తెచ్చుకోవడం మామూలు విషయం కాదు.
నెగిటీవ్ టాక్ వచ్చినా - నిర్మాతలు హ్యాపీగా ఉన్నారంటే, దానికి కారణం.. తొలి మూడు రోజుల వసూళ్లే. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోనూ రాబోతోంది. జనవరి 1న జీ 5లో ఈ సినిమాని ప్రదర్శిస్తారు. అయితే పే ఫర్ వ్యూ పద్ధతిన ఈ సినిమా చూడొచ్చు. 149 రూపాయలు పెట్టి టికెట్ కొంటే, ఇంటిల్లిపాదీ ఒకేసారి ఈ సినిమా చూసేయొచ్చు. ఈ టికెట్ల రూపంలో మరో కోటి అయినా రాబట్టొచ్చన్నది జీ 5 ప్లాన్. అది కూడా వర్కవుట్ అయిపోతే... సోలో బతుకే బెటర్.. ప్రాఫిట్స్ తెచ్చుకున్నట్టే.