క్లీవేజ్‌ మడత.. సర్జరీ కోత.!

మరిన్ని వార్తలు

గ్లామర్‌ తారగా పలు చిత్రాల్లో తన అభినయాన్ని ప్రదర్శించిన హీరోయిన్‌ సోనాలీ బింద్రే ఇటీవల క్యాన్సర్‌ బారిన పడిన సంగతి తెలిసిందే. కానీ ఆత్మస్ధైర్యం కోల్పోకుండా ఆ క్యాన్సర్‌ మహమ్మారితో తీవ్రంగా ఫైట్‌ చేసి చివరికి జయించింది. మృత్యుంజయురాలై తిరిగొచ్చి కెరీర్‌లో మళ్లీ బిజీ అయ్యింది. ఈ మధ్యనే కొత్త సినిమాలకు సైన్‌ చేసింది. ఇదిలా ఉంటే, తాజాగా సోనాలీ బింద్రే సోషల్‌ మీడియాలో ఓ ఫోటో పోస్ట్‌ చేసింది. ఈ ఫోటోలో సోనాలీ బింద్రే తన హాట్‌ క్లీవేజ్‌ని ఎక్స్‌పోజ్‌ చేస్తున్నట్లుగా ఉంది. 

 

ఈ పిక్‌కి సోషల్‌ మీడియాలో నెటిజన్స్‌ నుండి విమర్శలు వస్తున్నాయి. సోనాలీ.. నీకిది అవసరమా.? అంటూ పలువురు నెటిజన్లు నెగిటివ్‌గా కామెంట్‌ చేస్తున్నారు. ఈ కామెంట్స్‌కి రెస్పాండ్‌ అయిన సోనాలీ బింద్రే ఈ ఫోటోని ఎందుకు పోస్ట్‌ చేయాల్సి వచ్చిందో వివరణ ఇచ్చింది. ఎంతో మంది క్యాన్సర్‌ బాధితులున్నారు సమాజంలో. కానీ దాన్ని జయించే ధైర్యం అందరిలోనూ ఉండడం లేదు. క్యాన్సర్‌ బారిన పడితే ఇక చావే శరణ్యం అనే అపోహలో ఉన్నారు. 

 

అలాంటి వారిలో అవేర్‌నెస్‌ తీసుకొచ్చేందుకే నేను ఈ ఫోటో పోస్ట్‌ చేశాను.. అంటూ క్లీవేజ్‌తో పాటు, పొట్ట భాగంలో ఉన్న సర్జరీ కోతను కూడా బహిర్గతం చేసింది. అలాగే చాలా తక్కువ మేకప్‌తో, తలపై జుట్టు లేకుండా ముఖంలో చిరునవ్వుతో కనిపిస్తోంది సోనాలి. 'ఇదే నా సహజత్వం..' అని ఈ ఫోటో పోస్ట్‌ చేసింది. ఇదే నా సహజత్వం అని సోనాలీ చెప్పాక కూడా ట్రోల్‌ చేసేవారిని ఏమనాలో వారి విజ్ఞతకే వదిలేయాలిక. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS