రంగ‌స్థ‌ల‌మా.... మ‌జాకా..?!

మరిన్ని వార్తలు

కేబుల్ టీవీలూ, ఎంట‌ర్‌టైన్మెంట్ ఛాన‌ల్లూ, స్మార్ట్ ఫోన్లూ పెద్ద‌గా లేని రోజుల్లో శివ‌రాత్రి ఎలా గ‌డిచేదో గుర్తుంది క‌దా?? శివ‌రాత్రి వ‌చ్చిందంటే సినీ ప్రియుల‌కు పండ‌గ‌. ఒకే టికెట్టుపై రెండు సినిమాలు చూడొచ్చు. అర్థ‌రాత్రి వ‌ర‌కూ థియేట‌ర్ల‌లోనే గ‌డ‌పొచ్చు. అటు జాగారం, ఇటు వినోదం.. రెండూ క‌లిసి వ‌చ్చేస్తాయి. అయితే కాలం మారింది. ఇప్పుడు శివ‌రాత్రి జాగారం చేయాలంటే థియేట‌ర్ వ‌ర‌కూ వెళ్ల‌న‌వస‌రం లేదు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే స‌రిపోతుంది. 

 

పైగా పాత సినిమాల కోసం థియేట‌ర్ల‌కు వెళ్లే అల‌వాటు ఎప్పుడో పోయింది. ఎందుకంటే అమేజాన్‌, యూ ట్యూబుల్లో కొత్త సినిమాలొచ్చేస్తున్నాయి. అలాంట‌ప్పుడు టికెట్టు కొని మ‌రీ పాత సినిమా ఎందుకు చూడాలి..?? అయితే ఇలాంటి స్మార్ట్ యుగంలో కూడా ఓ పాత సినిమాని థియేట‌ర్లో వ‌స్తే.. హోస్ ఫుల్ అయిపోయింది. కొత్త సినిమా రిలీజ్ అయిన‌ట్టు టికెట్ట కోసం కౌంట‌ర్ ద‌గ్గ‌ర పోటీ ఏర్ప‌డింది. 

 

అవును.. శివ‌రాత్రి రోజున హైద‌రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో `రంగ‌స్థ‌లం` చిత్రాన్ని ప్ర‌త్యేకంగా ప్ర‌ద‌ర్శించారు. అర్థ‌రాత్రి ఆట‌కు... బెనిఫిట్ షోకి వ‌చ్చినంత జ‌నం వ‌చ్చారు. ఈ షోకి గానూ ఏకంగా 1.4 ల‌క్ష‌ల ఆదాయం వ‌చ్చింది. శివ‌రాత్రి రోజున హైద‌రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న థియేట‌ర్ల‌లో ప్ర‌త్యేక షోలు ఉంటాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ సినిమాకీ రాన‌న్ని వ‌సూళ్ల‌ని రంగ‌స్థ‌లం సొంతం చేసుకుంది. ఇది కూడా ఓ రికార్డే మ‌రి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS