ట్రోలర్స్‌కి హాట్‌బ్యూటీ స్వీట్‌ వార్నింగ్‌.!

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ భామ సోనమ్‌ కపూర్‌ తాజాగా సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌కి గురవుతోంది. అందుకు కారణం ఆమె డ్రస్సింగ్‌. ఫ్యాషన్‌ ఐకాన్‌ అయిన సోనమ్‌ కపూర్‌ డ్రస్‌ గురించి నెటిజన్స్‌కి ఎందుకింత ఉుకు.. అంటారా.? అసలు వివరాల్లోకి వెళితే, ఆదిత్యా రాయ్‌ కపూర్‌, దిశా పటానీ జంటగా తెరకెక్కిన ‘మంగ్‌’ చిత్రం లేటెస్ట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందర్భంగా, ఈ మూవీ ప్రివ్యూ షోకు హాజరైన సోనమ్‌ ట్రోలర్స్‌కి అడ్డంగా దొరికేసింది. ఆమె తండ్రి, సీనియర్‌ హీరో అనిల్‌ కపూర్‌ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. సో తండ్రితో కలిసి ఈ సినిమా ప్రివ్యూ వీక్షించేందుకు వచ్చింది సోనమ్‌ కపూర్‌. అంతా బాగానే ఉంది. కానీ, తండ్రితో కలిసి వచ్చిన సోనమ్‌ కపూర్‌ డ్రస్సింగే ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యింది.

 

బ్లాక్‌ అండ్‌ హాట్‌ క్లీవేజ్‌ కాస్ట్యూమ్‌లో సోనమ్‌ కపూర్‌ ఈ ప్రివ్యూ షోకి విచ్చేసింది. మరి, మన ఆకతాయి నెటిజన్లు ఊరుకుంటారా.? ఓ రేంజ్‌లో ఆటాడేసుకుంటున్నారు. అసలే ఈ మధ్య హీరోయిన్స్‌ డ్రస్‌లపై కామెంట్లు బాగా ఎక్కువైపోయాయ్‌. బాలీవుడ్‌, టాలీవుడ్‌, ఏ ఉడ్‌ అనే తేడా లేకుండా నెట్టింటి పుణ్యమా అని, ఆడుకోవడానికి ఓ ఐటెం దొరికినట్లవుతోంది. ఇదిలా ఉంటే, తనపై వస్తున్న ట్రోల్స్‌పై తాజాగా సోనమ్‌ కపూర్‌ స్పందించింది. కెరీర్‌లో ఇలాంటివి చాలానే చూసేశాను.. ఈ రంగాన్ని నా కెరీర్‌గా ఎంచుకున్నప్పుడే ఓ నిర్ణయం తీసుకున్నా.. ఆ నిర్ణయాన్ని మా నాన్న గౌరవించారు. స్వాగతించారు. సో మీరూ అప్‌డేట్‌ అవ్వండి. పాత కాలం ఆలోచనల్ని వీడి, అప్‌డేట్‌ అవ్వండి..’ అంటూ స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS