హీరోయిన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన గాన గాంధర్వుడు.!

మరిన్ని వార్తలు

కాస్ట్యూమ్స్‌ విషయంలో ఇప్పుడు ముద్దుగుమ్మలు చాలా చాలా పొదుపుగా వ్యవహరిస్తున్నారు. సీనియర్‌, జూనియర్‌ అనే తేడా లేదు. ఏ హీరోయిన్‌కి అయినా ఈ బట్టల పొదుపు వర్తించేస్తోంది. ఒకప్పుడు బికినీ అంటే ఓ సెన్సేషన్‌. కానీ ఇప్పుడు ప్రతీ హీరోయిన్‌ బికినీ వేసి మురిసిపోవాలనుకుంటున్నారు. ఇదిలా ఉంటే, పాటల సెన్సేషన్‌, గాన గాంధర్వుడు శ్రీ ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం తాజాగా హీరోయిన్స్‌ వస్త్రధారణపై స్సందించారు. 

 

ఓ కార్యక్రమానికి విచ్చేసిన బాలసుబ్రహ్మణ్యం ఈ విషయమై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగాంగ ప్రదర్శన చేస్తేనే అవకాశాలు వస్తాయా.? అవకాశాల కోసం ఓ స్త్రీ పాత్రధారి ఇంత దిగజారిపోవాలా.? అని ఆయన ప్రశ్నించారు. మన తెలుగు సినిమా సాంప్రదాయాల్ని స్త్రీ పాత్రధారి వస్త్రధారణతో ఇంత భ్రష్టు పట్టించేస్తున్నారే అని ఆయన ఒకింత ఆవేదనతో కూడిన ఆగ్రహానికి గురయ్యారు. 

 

గతంలోనూ సినిమాలు వచ్చేవి. కానీ హీరోయిన్లు మరీ ఇంత దిగజారి నటించలేదు ఆ కాలంలో. కానీ ఇప్పుడు స్త్రీ జాతి సిగ్గు పడేలా తెరపై స్త్రీ పాత్రధారుల వస్త్రధారణ ఉంటోందనీ ఆయన అన్నారు. ఇలా స్పందించినందుకు హీరోయిన్లు నన్ను తిడితే తిట్టనివ్వండి. సామాజిక బాధ్యతలో భాగంగా నేను ఈ విషయమై స్పందించాల్సి వచ్చింది.. అని బాలు సభాముఖంగా ఆవేదన వ్యక్తం చేశారు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS