బాలు అంటే అందరికీ పిచ్చే. ఆయన పాటంటే పిచ్చి, ఆయన మాటంటే పిచ్చి. బాలూకి ఓ పిచ్చి ఉంది. అదే.. క్రికెట్. ఆయన కాలక్షేపం అంతా క్రికెట్‌తోనే. స్కూలు రోజుల్లో బాలు క్రికెట్ ఆడేవారు. బ్యాటింగ్ పెద్దగా రాదు గానీ, బౌలింగ్ బాగా చేసేవారు. ఆయన తన టీమ్‌లో ప్రధాన స్పిన్నర్. బ్యాటింగ్ లో చివరి స్థానమే. 1983 లో భారతజట్టు ప్రపంచ కప్ గెలిచినప్పుడు.. ఆయన చేసిన హడావుడి అంతా ఇంతా కాదట. ఆ టేపుల్ని ఆయన ఇప్పటికీ దాచుకున్నార్ట.
ఆరోజున ఇంట్లో మ్యాచ్ చూడ్డానికి... నాలుగు టీవీలు తెచ్చి పెట్టుకున్నార్ట. ఒకొక్క గదిలో ఒకొక్క టీవీ. పని మీద.. మరో గదికి వెళ్లినప్పుడు.. మ్యాచ్ మిస్ అవ్వకుండా ఈ ఏర్పాటు. తన స్నేహితులతో కలిసి.. క్రికెట్ మ్యాచ్ చూశారు. అయితే...తన స్నేహితులలో ఇద్దరు వెస్టిండీస్ అభిమానులు. వారిద్దరూ.. పైనల్ మ్యాచ్ వెస్ట్ ఇండీస్ కొడుతుందని, బాలు మాత్రం `లేదు.. భారత జట్టే గెలుస్తుంది` అని పందెం కూడా వేసుకున్నార్ట. మొత్తానికి భారత జట్టే క్రికెట్ కప్ సాధించింది. ఐపీఎల్ ని కూడా వదిలిపెట్టరు బాలు. ఈ ఐపీఎల్ చూడ్డాలని ఎంత ఆశ పడ్డారో..? ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా కాలక్షేపానికి క్రికెట్ మ్యాచులే చూశావరట బాలూ.