ఎప్పుడూ ఎవరో ఒకర్ని కెలక్కపోతే ఆమెకి నిద్రపట్టదేమో.! ఆమె ఇంకెవరో కాదు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన శ్రీరెడ్డి. టాలీవుడ్‌లో లైంగిక వేధింపులంటూ రచ్చకెక్కిన శ్రీరెడ్డి, ఆ తర్వాతి నుంచీ పబ్లిసిటీ స్టంట్లు చేస్తూనే వుంది. మెగాస్టార్ చిరంజీవి నుంచి నేచురల్ స్టార్ నాని దాకా.. చాలామందిపై ఆరోపణలు చేస్తూ వచ్చింది. పవన్ కళ్యాణ్ పేరు చెబితే చాలు, ఆమె మరింతగా రెచ్చిపోతుంటుంది. ఈ మధ్య కాస్త సైలెంటయిన శ్రీరెడ్డి, తాజాగా అమలా పాల్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కింది. ‘నీ పంజాబీ భర్త నిన్ను బాగానే చూసుకుంటాడు లే.. నాకు ఆ నమ్మకం వుంది..’ అంటూ శ్రీరెడ్డి చేసిన వెటకారం, అమలా పాల్ అభిమానుల్ని హర్ట్ చేసింది.
శ్రీరెడ్డిపై తిట్ల వర్షం కురిపించేస్తున్నారు అమలా పాల్ అభిమానులు. ఇటీవల అమలా పాల్ పెళ్ళి జరిగిందంటూ కొన్ని ఫొటోలు బయటకు వచ్చిన విషయం విదితమే. అయితే, అదంతా ఓ ఫొటో షూట్ తప్ప, పెళ్ళి కాదని ఆ తర్వాత తేలింది. అమలా పాల్‌కి గతంలలో ఓ సారి పెళ్ళయ్యింది. అయితే, అభిప్రాయ బేధాలు రావడంతో అమలా పాల్ వైవాహిక బంధానికి గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. ఓ బాలీవుడ్ సింగర్‌తో అమలా పాల్ గత కొంతకాలంగా ప్రేమలో వున్న మాట వాస్తవం. అయితే, అది ప్రేమ కాదు.. కేవలం స్నేహం మాత్రమేనని అమలా పాల్ అంటోంది. అయినా, అమలా పాల్ గొడవెందుకు శ్రీరెడ్డికి.?