సినీ రంగంలో భాషతో సంబంధం లేకుండా పలు చిత్రాల్లో నటించి, తెలుగు వారి గుండెల్లో అతిలోక సుందరిగా గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ అలనాటి మేటి నటి శ్రీదేవి. హీరోయిన్‌గా రెండు తరాల నటులతో నటించిన ఘనత ఈమెకే దక్కింది. ఎంత వయసు పెరిగినా తరగని అందం ఆమెది. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆమె చేసిన సినిమాలు మంచి గుర్తింపునే సాధించాయి. ఆమె నటించిన 'ఇంగ్లీష్ వింగ్లీష్' సినిమా అన్ని భాషల్లోనూ మంచి రెస్పాన్స్ అందుకుంది. తాజాగా ఈ మహానటి భర్త బోనీకపూర్ నిర్మాణంలో ఓ సినిమాలో నటిస్తోంది. శ్రీదేవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోంది ఈ చిత్రం. ఈ సినిమాలో శ్రీదేవి ఫస్ట్‌లుక్ విడుదలయ్యింది. బ్లాక్ శారీలో దీన వదనంతో ఉన్న ఆమె ఫోటో ఆశక్తికరంగా మారింది. 'మామ్' అనే టైటిల్‌తో వస్తోన్న ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ పోస్టర్ శ్రీదేవి అభిమానుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. తన కూతురుపై జరిగిన అఘాయిత్యానికి సవతి తల్లి ఎలా న్యాయం చేసిందనే కొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఫస్ట్‌లుక్‌కి వస్తోన్న రెస్పాన్స్ అదిరిపోతోంది. ఇక సినిమా ఎలా ఉండబోతోందో అంటూ క్యూరియాసిటీ నెలకొంది. అన్నట్లు ఈ సినిమా శ్రీదేవికి 300వ సినిమా కావడం విశేషం. రవి ఉద్యవర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా జులై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.