నాని 'నెక్ట్స్ నువ్వే' అంటూ గత రెండు నెలల క్రితం శ్రీరెడ్డి హెచ్చరించింది. టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ అంటూ ఆమె ఎత్తుకున్న పోరాటంలో భాగంగా అప్పటికే పలువురిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి, ఈ ఉద్యమం పక్క దారి పట్టడంతో కొన్నాళ్లు తన నోటికి తాళం వేసుకుంది. మళ్లీ ఇప్పుడే ఆ తాళం తీసి ఒక్కొక్కరిపై నమ్మలేని సంచలన వ్యాఖ్యలు చేయడం పనిగా పెట్టుకుంది. అందులో భాగంగానే ఆల్రెడీ రోజాపై వేసేసింది.
ఇప్పుడు తాజాగా నేచురల్ స్టార్ నానిపై ఆరోపణలు మొదలెట్టింది. నానిని 'కామాంధుడి'గా అభివర్ణించింది శ్రీరెడ్డి. నాని అంటే నేచురల్ స్టార్. మన ఇంట్లో అబ్బాయి. లేదా పక్కింటబ్బాయిగా భావిస్తుంటాం. అలాంటి నానిపై డైరెక్ట్‌గా నాని కామాంధుడు. ఓ అమ్మాయికి రోజంతా చుక్కలు చూపించాడు అని శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. మరోపక్క 'అమోలి' అనే ఓ షార్ట్ ఫిల్మ్‌కి నాని తన గాత్రాన్ని అందించాడు. తెలుగులో నాని వాయిస్ ఓవర్‌తో ఈ షార్ట్ ఫిల్మ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
మహిళలపై ముఖ్యంగా ముక్కు పచ్చలారని బాలికలపై జరుగుతున్న అకృత్యాలు, అరాచకాలకు సంబంధించిన అంశాలను ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ గొప్ప ప్రయత్నంలో తాను ఓ భాగమయ్యాడు నాని. ఇలా ఈ షార్ట్ ఫిల్మ్‌లో నాని తన వాయిస్ ఓవర్ ఇచ్చినందుకుగానే శ్రీరెడ్డి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి గొప్ప ప్రయత్నానికి నానిలాంటి కామాంధుడు వాయిస్ ఇవ్వడమేంటి. సూపర్‌స్టార్ మహేష్‌బాబులాంటి వాళ్లు వాయిస్ ఇస్తే బావుండేది అని శ్రీరెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.