అటు శివాజీ రాజా, ఇటు నరేష్...'మా' కొత్త అధ్యక్షుడు ఎవరు? అనే ప్రశ్నకు సమాధానం దొరికేసింది. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన 'మా' ఎన్నికలలో శివాజీరాజాపై నరేష్ గెలిపొందారు. ఆదివారం `మా` ఎన్నికలు జరిగాయి. 800 ఓటర్లు ఉన్న 'మా'లో.. దాదాపు 470మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బ్యాలెట్ పద్ధతిన జరిగిన ఎన్నికలు కావడంతో కౌంటింగ్‌కి చాలా సమయం పట్టింది. సోమవారం తెల్లవారు ఝాము వరకూ కౌంటింగ్ ప్రక్రియ సాగుతూనే ఉంది. ఎట్టకేలకు ఉదయం 4 గంటలకు తుది ఫలితం వెలువడింది.
ఎగ్జిక్యూటీవ్ వైస్ ప్రెసిడెంట్‌గా పోటీ చేసిన రాజశేఖర్, జనరల్ సెకరెట్రీ గా జీవిత గెలుపొందడం విశేషం. వైస్ ప్రెసిడెంట్లుగా ఎస్వీ కృష్ణారెడ్డి, హేమ విజయం సాధించారు. జాయింట్ సెక్రటరీగా గౌతమ్ రాజు, శివాజీ రాజా గెలిచారు. వీళ్లతో పాటు అలీ, రవిప్రకాష్, తనికెళ్ల భరణి, సాయికుమార్, ఉత్తేజ్, ఫృథ్వీ, జాకీ, సురేష్ కొండేటి, అనితా చౌదరి, అశోక్ కుమార్, సమీర్, ఏడిద శ్రీరామ్, రాజా రవీంద్ర, తనీష్, జయలక్ష్మీ, కరాటే కళ్యాణి, వేణుమాధవ్, పసునూరి శ్రీనివాస్ ఈసీ మెంబర్స్ గా గెలిచారు.