కాస్టింగ్ కౌచ్ పేరుతో తెలుగు పరిశ్రమలో శ్రీరెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. టాలీవుడ్ లోని ప్రముఖ నటీనటులు, నిర్మాతలను టార్గెట్ చేస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేసి మధ్యలో చెన్నై చెక్కేసింది. అక్కడ రెండు మూడు సినిమా ఆఫర్లు వచ్చాయని, వాటితో బిజీగా ఉన్నానంటూ కొన్ని రోజులు తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నింది. మళ్ళీ తాజాగా హైదరాబాద్ వచ్చి తనదైన శైలిలో విమర్శలు మొదలుపెట్టింది.
కాగా, ప్రస్తుతం 'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' అధ్యక్ష పదవి కోసం సీనియర్ నటుడు నరేష్ మరియు శివాజీ రాజా హోరాహోరీగా పోటీ పడుతున్నారు. నరేష్ ప్యానల్ లో జీవితరాజశేఖర్ లు మరియు శివాజీ రాజా ప్యానల్ లో ప్రముఖ నటుడు శ్రీకాంత్ ప్రధాన సభ్యులుగా కనిపిస్తున్నారు. ఈ రెండు ప్యానల్స్ సభ్యులు మద్దతు కోసం పలు నటీనటులతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవిని కూడా కలిసిన విషయం తెలిసిందే.
అయితే, సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన శ్రీరెడ్డి 'మా' ఎన్నికలపై కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా నిలిచిన 'మా' ఎన్నికల్లో తన సపోర్ట్ శివాజీ రాజా ప్యానెల్ కే అని చెప్తూ ఓ వివాదాస్పదమైన పోస్ట్ పెట్టింది. "శివాజీ రాజా చాలా మంచి మనసున్న వ్యక్తి అని.. ఆయన్ని కాదని మా అసోసియేషన్ ని క్రిమినల్స్ మరియు లేడీ సప్లయర్స్ చేతులో పెట్టొద్దంటూ" కామెంట్స్ చేసింది. ఈ పోస్ట్ లో శ్రీ రెడ్డి క్రిమినల్స్ మరియు లేడీ సప్లయర్స్ అని జీవిత రాజశేఖర్ లని ఉద్దేశించి అన్నవే. ఎందుకంటే గతంలో కూడా తను జీవితపై లేడీ సప్లయర్ అని ఆరోపణలు చేసిన విషయం మనకు తెలిసిందే.