గత నెల రోజులుగా టాలీవుడ్‌లో సునామీలా దూసుకొస్తోన్న శ్రీరెడ్డి ఆరోపణల వెల్లువ ఇప్పుడు వాకాడ అప్పారావ్‌పై పడింది. వాకాడ అప్పారావ్ అంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. వాకాడ అప్పారావ్ అంటే, సూపర్ గుడ్ ఫిల్మ్స్. సూపర్‌గుడ్ ఫిల్మ్స్ అంటే వాకాడ అప్పారావ్. అంతగా ఆయన పేరు పాపులారిటీ అయ్యింది. సూపర్ గుడ్ ఫిల్మ్స్‌కి అంతా ఆయనే. అలాగే ఆయనపై ఎలాంటి ఆరోపణలు లేవు ఇంతవరకూ. మంచి వ్యక్తిగా పెద్ద మనిషిగా పేరున్న వ్యక్తి ఆయన.
అలాంటిది శ్రీరెడ్డి ఎపిసోడ్ ఆయన్ని కూడా చుట్టడంతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇండస్ట్రీకి వచ్చిన పదహారేళ్ల అమ్మాయిలను అంటే ఫ్రెష్ గాళ్స్‌ను అవకాశాలడిగితే లైంగికంగా వేధిస్తాడంటూ ఆయనపై ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి. అంతేకాదు, ఆయన బాధితులను పక్కా ఆధారాలతో చూపిస్తాననీ చెబుతోంది. మొత్తానికి ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం పాటు అభిరుచి గల నిర్మాతగా కొనసాగుతోన్న వాకాడ అప్పారావ్‌ని ఓ కామ పిశాచిగా అభివర్ణిస్తూ, శ్రీరెడ్డి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి వారి ప్రక్షాళన ఇండస్ట్రీకి అత్యావశ్యకమని ఆమె కోరుతోంది.
ఆమె చేసిన అర్ధ నగ్న ప్రదర్శనతో మా అసోసియేషన్ దిగొచ్చింది. కారణమేదైనా తనపై విధించిన బ్యాన్‌ని ఎత్తివేసింది. అలాగే సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల నిమిత్తం 'క్యాష్' అనే ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ విషయం పక్కన పెడితే, కోనవెంకట్‌పై శ్రీరెడ్డి చేసిన ఆరోపణలకు ఆయన లీగల్‌గా ప్రొసీడ్ అవుతానని హెచ్చరించగా, అందుకు ఆమె కూడా అలాగే చేస్తానని సమాధానమిచింది. తాజాగా వెలుగులోకి వచ్చిన వాకాడ అప్పారావ్ ఎపిసోడ్ ఏ స్థాయికి చేరుతుందో చూడాలిక.