బిజీ అవుతోన్న మలయాళీ బ్యూటీ.!

By Inkmantra - March 08, 2019 - 11:30 AM IST

మరిన్ని వార్తలు

రీసెంట్‌గా '118' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ముద్దుగుమ్మ నివేదా థామస్‌ ముందు ముందు బిజీయెస్ట్‌ హీరోయిన్‌ కానుంది. ఇప్పటికే తెలుగులో రెండు బిగ్‌ ప్రాజెక్టులకు సైన్‌ చేసిన ఈ ముద్దుగుమ్మ త్వరలో తమిళ తంబీలనూ అలరించనుంది. తమిళంలో కూడా వరుస ఆఫర్లు అందుకుంటోంది. అప్పుడెప్పుడో కమల్‌హాసన్‌ హీరోగా తెరకెక్కిన సూపర్‌ హిట్‌ మూవీ 'పాపనాశం'లో కమల్‌కి కూతురుగా నటించి మెప్పించింది. 

 

హీరోయిన్‌గా ఇప్పుడిప్పుడే మంచి అవకాశాలు అందుకుంటోంది. ఆల్రెడీ రెండు ప్రాజెక్టులపై సైన్‌ చేసింది. మరో రెండు చర్చల దశలో ఉన్నాయట. ఎన్ని ప్రాజెక్టులు టేకప్‌ చేసినా, వేటికవే డిఫరెంట్‌ సబ్జెక్టులై ఉండాలి అంటోంది అందాల నివేదా. ప్రధానంగా హీరోలతో సమానమైన బలం ఉన్న పాత్రలే ఎంచుకుంటానంటోంది. ఎవరైనా హీరోయిన్స్‌తో పోటీ పెట్టుకుంటారు. కానీ నివేదా ఖిలాడీనే. ఏకంగా హీరోయిన్స్‌కే టెండర్‌ పెట్టేసింది. 

 

నివేదాని తక్కువంచనా వేయడానికి లేదు. అంతటి టాలెంట్‌ ఉన్నదే. '118' సినిమాకి నివేదా పాత్రే అత్యంత కీలకం. 'జై లవకుశ' తర్వాత నివేదా నటించిన ఈ సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టడంతో పాటు, ఆమె రూపంలో కళ్యాణ్‌రామ్‌కీ లక్కు కలిసొచ్చేలా చేసింది. అప్పుడెప్పుడో 'పటాస్‌'తో సూపర్‌ హిట్‌ కొట్టిన కళ్యాణ్‌రామ్‌ మళ్లీ ఆ స్థాయిలో '118'తోనే మరో హిట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS