మ‌హేష్ సినిమాపై రాజ‌మౌళి కీల‌క‌మైన వ్యాఖ్య‌లు.

మరిన్ని వార్తలు

తెలుగు ప్రేక్ష‌కులు ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేష‌న్ మ‌హేష్ బాబు - రాజ‌మౌళి. తెలుగు సినిమా రికార్డుల‌న్నీ బ‌ద్ద‌లు కొట్టే స్టామినా ఈ సినిమాకి ఉంద‌ని సినీ ప్ర‌పంచం న‌మ్ముతోంది. `ఆర్‌.ఆర్‌.ఆర్‌` తర‌వాత రాజ‌మౌళి ఈ సినిమానే సెట్స్‌పైకి తీసుకెళ్తారు. ఇదో జేమ్స్ బాండ్ త‌ర‌హా క‌థ‌ని, మ‌హేష్ `రా` ఏజెంట్‌గా న‌టిస్తాడ‌ని ప్ర‌చారం మొద‌లైంది.

 

ఇప్ప‌టికే క‌థ‌పై ఓ క్లారిటీ వ‌చ్చేసింద‌ని, స్క్రిప్టు ప‌నులు కూడా జ‌రుగుతున్నాయ‌ని చెప్పుకుంటున్నారు. అయితే వీటిపై రాజ‌మౌళి ఓ క్లారిటీ ఇచ్చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కూ క‌థేమిట‌న్న విష‌యంలో ఎలాంటి చ‌ర్చా జ‌ర‌ప‌లేద‌ని చెప్పుకొచ్చారు. ``మ‌హేష్ స్టైల్‌కీ, నా అభిరుచికీ త‌గిన‌ట్టుగా ఆ సినిమా ఉంటుంది. ఆర్‌.ఆర్‌.ఆర్ త‌ర‌వాత కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుంటా. ఆ త‌ర‌వాతే.. మ‌హేష్ సినిమా గురించి ఆలోచిస్తా`` అన్నారు రాజ‌మౌళి. సో... జేమ్స్ బాండ్ టాపిక్కు కొంత‌కాలం ప‌క్క‌న పెట్టాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS