యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో అరుదైన మల్టీ స్టారర్‌గా రూపొందుతోన్న చిత్రానికి మొదట్నుంచీ వర్కింగ్ టైటిల్ పేరుతో 'ఆర్‌ఆర్‌ఆర్' అనే టైటిల్ పాపులర్ అయ్యింది. అయితే, ఈ టైటిల్‌లో ఉన్న మూడు ఆర్‌లకు మూడు అర్ధాలొచ్చేలా ఈ సినిమా టైటిల్ ఉండబోతోందనీ, ఈలోగా అభిమానులకు నచ్చిన టైటిల్స్ డిజైన్ చేయమనీ, వాటిలో బెస్ట్ టైటిల్‌ని ఈ సినిమా ఫైనల్ చేస్తామనీ ఈ చిత్రాన్ని చెక్కుతున్న జక్కన్న ముందుగానే అభిమానులకు ఫజిల్ విసిరారు. అందులో భాగంగా ఇప్పటికే 'రామ రావణ రాజ్యం' అనీ, 'రామ రౌద్ర రుషితం' అనీ పలు రకాల టైటిల్స్ ప్రాచుర్యంలోకి వచ్చాయి. అయితే, అన్నింట్లోకీ 'రామ రావణ రాజ్యం' టైటిల్ క్యాచీగా ఎక్కువ ప్రజాదరణ పొందిన సంగతి తెలిసిందే. ఆ కారణంగా ఇదే టైటిల్‌ని 'ఆర్‌ఆర్‌ఆర్'కి ఫిక్స్ చేస్తారనుకున్నారంతా. కానీ, ఈ లోపే ఈ టైటిల్‌ని వి3 ఫిలింస్ అనే ఓ నిర్మాణ సంస్థ తన సొంతం చేసుకుంది.
ఈ టైటిల్‌కి ఉన్న పాపులారిటీని గ్రహించిన సదరు నిర్మాణ సంస్థ ముందుగానే ఈ టైటిల్‌ని తమ పేరున రిజిస్టర్ చేయించేసుకుంది. దాంతో 'ఆర్‌ఆర్‌ఆర్' టీమ్ అరెరే మా టైటిల్ మిస్సయ్యిందే అనుకున్నారో లేదో కానీ, ఫ్యాన్స్ మాత్రం తెగ ఫీలయిపోతున్నారు. అనుకున్న టైటిల్ మిస్సయ్యిందిలా. 'ఆర్‌ఆర్‌ఆర్'కి ఇప్పుడు ఇంకెలాంటి క్యాచీ టైటిల్ ఎంచుతారో చూడాలిక.