మలయాళ సినిమాతో సినీ కెరీర్ స్టార్ట్ చేసిన ముద్దుగుమ్మ సాయిపల్లవి తెలుగులో 'ఫిదా' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి నేచురల్ నటిగా మంచి పేరు తెచ్చుకుంది. అయితే సాయి పల్లవితో వచ్చిన చిక్కల్లా ఒక్కటే. ముఖానికి మేకప్ మాత్రం వేయనివ్వదు. ముఖం నిండా పింపుల్స్‌తో నేచురల్‌గా కనిపించేందుకే ఇష్టపడతానంటుంది. అయితే సెలబ్రిటీలన్నాక మేకప్ తప్పనిసరి. కానీ సాయిపల్లవిని అలా ఇష్టపడిన దర్శక, నిర్మాతలే తమ సినిమాల్లో అవకాశాలు ఇస్తూ వచ్చారు ఇంతవరకూ.
కానీ ఈ మధ్య ఓ గోల్డెన్ ఛాన్స్‌ని మేకప్ కారణంగా సాయిపల్లవి వదులుకోవల్సి వచ్చిందంటూ టాక్ వినిపిస్తోంది. ఎంతటి విలువైన ఛాన్స్ అయినా సాయిపల్లవి ఇంతే.. మనసు మార్చుకోదట. మేకప్, గ్లామర్ విషయంలో. తనను అలా ఇష్టపడే వాళ్లే అవకాశాలు ఇస్తారనీ, తాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మారననీ సాయిపల్లవి గట్టిగా చెప్పేస్తోంది. అయితే ఆమె అభిమానులు మాత్రం కొంతలో కొంత ఒక్క మెట్టైనా దిగితే బావుండు కదా సాయిపల్లవీ.. అని సలహాలు ఇస్తున్నారట.
అయితే వాటిని కూడా సాయిపల్లవి సున్నితంగా తిరస్కరిస్తోందట. ప్రస్తుతం సాయిపల్లవి తమిళంలో 'ఎన్జీకే' చిత్రంలో నటిస్తోంది. సూర్య హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్‌సింగ్ మరో హీరోయిన్‌గా నటిస్తోంది. తమిళంలో ధనుష్‌తో నటించిన 'మారి 2'లో 'రౌడీ బేబీ' సాంగ్ సోషల్‌మీడియాలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తెలుగులో సాయి పల్లవి యంగ్ హీరో రానాతో ఓ సినిమాలో నటిస్తోందనీ సమాచారమ్. మరికొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి.