సుధీర్ కూడా హీరో అయిపోయాడు!

By iQlikMovies - May 24, 2019 - 09:00 AM IST

మరిన్ని వార్తలు

జ‌బ‌ర్‌ద‌స్త్‌తో పాపుల‌ర్ అయిన హాస్య‌న‌టుడు సుధీర్‌. సుడిగాడి సుధీర్ పేరుతో చేసిన స్కిట్లు ప్రేక్ష‌కుల్ని బాగా న‌వ్వించాయి. ఈ షోతోనే సుధీర్ పాపుల‌ర్ అయ్యాడు. ఇప్పుడు హీరోగానూ మార‌బోతున్నాడు. సుధీర్ క‌థానాయ‌కుడిగా 'సాఫ్ట్ వేర్ సుధీర్‌' అనే సినిమా తెర‌కెక్కుతోంది. ధ‌న్యా బాల‌కృష్ణ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పులిచ‌ర్ల ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. జులైలో ఈ సినిమా విడుద‌ల కానుంది. జ‌బ‌ర్‌ద‌స్త్ టీమ్ నుంచి చాలామంది వెండి తెర‌పైకొచ్చారు.

 

కానీ.. ఎవ్వ‌రూ సుధీర్‌లా హీరో కాలేదు. వాళ్లంతా హాస్య పాత్ర‌ల‌తోనే స‌ర్దుకుపోతున్నారు. మ‌రి హీరోగా సుధీర్ సుడి ఎలా ఉందో చూడాలంటే ఈ సినిమా వ‌చ్చే వ‌ర‌కూ ఆగాలి. ''న‌న్ను హీరో అంటున్నారు గానీ, నేను క‌థ‌నే హీరో అనుకుంటున్నా. ఈ క‌థ చెబుతున్నంత సేపూ నేను న‌వ్వుతూనే ఉన్నా. అంత బాగా న‌చ్చింది. ప‌క్కింటి అబ్బాయిలాంటి ఇమేజ్ జ‌బ‌ర్ ద‌స్త్ షో ద్వారా నాకొచ్చింది. ఈ సినిమాలోనూ అలాంటి పాత్రే పోషిస్తున్నా'' అంటున్నాడు సుధీర్‌. ఈ సినిమా హిట్ట‌యితే వెండి తెర‌పై కూడా సుధీర్ బిజీ అయిపోతాడేమో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS