అక్కినేని నాగేశ్వరరావు సంపూర్ణ జీవితం గడిపాడు. ఓ గొప్ప నటుడు అనే విషయం పక్కన పెడితే, అంతకు మించి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆనందంగా జీవించాలని నేర్చుకున్న, నేర్పిన గొప్ప వ్యక్తి. అరవైలలో, ఇరవైలలా ఉండడం గురించి చాలా మంది చాలా రకాలుగా చెబుతారు. అక్కినేని చేసి చూపించారు. అరవైలేంటీ.? డబ్బైలలోనూ, ఎనభైలలోనూ అక్కినేని అదే హుషారు చూపించారు. మనసుని ఇరవైలలోనే లాక్ చేయగలిగితే ఎంత వయసొచ్చినా హ్యాపీగా ఉండొచ్చని అక్కినేని చెప్పేవారు. చివరి రోజుల్లో క్యాన్సర్ అక్కినేనిని కుంగదీసేందుకు ప్రయత్నించింది.
తనకు క్యాన్సర్ సోకిన విషయాన్ని బాహాటంగా ప్రకటించడం సుమంత్‌కి నచ్చలేదట. స్వయంగా సుమంత్ ఓ ఇంటర్య్వూలో చెప్పాడీ మాట. క్యాన్సర్ వచ్చిందని అక్కినేని చెప్పడం వెనక ఓ మంచి ఉద్దేశ్యం ఉంది. ఆ వయసులో కూడా నేను క్యాన్సర్‌ని గెలిచి తీరతాను అన్న అక్కినేని పట్టుదలకు భళా అని అనకుండా ఎవరూ ఉండలేకపోయారు. అక్కినేని తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు అనే బాధ ఎవరిలోనూ కలగలేదు.
క్యాన్సర్‌తో బాధపడుతూనే అక్కినేని తన చివరి సినిమా 'మనం' పూర్తి చేశారు. ఎవరన్నారు అక్కినేని మన మధ్య లేరని. ఒక్కసారి 'మనం' సినిమా చూస్తే అక్కినేని జీవించే ఉన్నారు అని ఒప్పుకుని తీరాల్సిందే. ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగాక అత్యంత ఎక్కువ కాలం జీవించిన వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు మాత్రమే.