సందీప్‌కిషన్‌ వేసవి తాపం పెంచేశాడిలా.!

మరిన్ని వార్తలు

'మనసుకు నచ్చింది' సినిమాతో రెచ్చిపోయి హీరోయిన్‌తో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ చేసేశాడు యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌. కానీ ఆ రొమాన్స్‌ పాపం మనోడికి వర్కవుట్‌ కాలేదు. మళ్లీ అదే చేస్తున్నాడు లేటెస్ట్‌ మూవీ 'నిను వీడని నీడను నేనే' సినిమాతో. కార్తీక్‌ రాజు ఈ సినిమాకి దర్శకుడు. వి. స్టూడియోస్‌తో కలిసి సందీప్‌ కిషన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అన్యా సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. 

 

లేటెస్ట్‌గా ఈ సినిమా నుండి ఓ పోస్టర్‌ బయటికి వచ్చిందండోయ్‌. హీరో, హీరోయిన్‌ మధ్య ఘాటు రొమాంటిక్‌ పోస్టర్‌ అది. కారు బ్యానెట్‌ మీద కూర్చున్న హీరోయిన్‌ని సందీప్‌కిషన్‌ ఘాటుగా కిస్‌ చేసేందుకు సిద్ధపడుతున్నాడు. ఈ పోజుకి కుర్రకారు గుండెల్లో సెగలు మొదలైపోయాయ్‌. అంటే ఈ సినిమాలో సెగలు పుట్టించే సన్నివేశాలు చాలానే ఉన్నాయని శాంపిల్‌కి ఈ పోస్టర్‌ వదిలారన్న మాట. ఇదంతా బాగానే ఉంది కానీ, ఈ పోస్టర్‌ చూసి ఇదేదో పక్కా రొమాంటిక్‌ మూవీ అనుకుంటే తప్పులో కాలేసినట్లే. 

 

ఇదో హారర్‌ అండ్‌ థ్రిల్లర్‌ మూవీ. ఇకపోతే ఈ తరహా కంటెన్ట్‌ మూవీకి కాస్త మసాలా కూడా అవసరమే కదా. లేకుంటే, రెసిపీ అంత టేస్టీగా ఉండదు మరి. అందుకే ఇలా. ఈ పోస్టర్‌తో సినిమాపై ఓ మోస్తరు అంచనాలైతే మొదలయ్యాయి కానీ, పోస్టర్‌లో ఏముంది.. వంకాయ్‌ సినిమాలో విషయముండాలి అనుకుంటున్నారా. పోస్టర్స్‌తో సెన్సేషనల్‌ కొట్టేసిన సినిమాల హిస్టరీ మర్చిపోకూడదు మరి. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS