మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన '118' చిత్రం మంచి టాక్‌తో రన్ అవుతోంది. ఈ సినిమాకి పోజిటివ్ రివ్యూలు రావడంతో బాగానే కలెక్షన్లు రాబడుతోంది. నాలుగు రోజులకు '118' చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో కలిపి 5.58 కోట్లు షేర్ దక్కించుకుంది. శివరాత్రి సందర్భంగా వీకెండ్ ఎక్స్‌ట్రా కావడంతో ఈ సినిమాకి కలిసొచ్చింది. అయితే ఈ రోజు నుండి వసూళ్లు కాస్త డ్రాప్ అయ్యాయి. మ్యాట్నీ, మార్నింగ్ షో డల్‌గా ఉన్నట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి. సాయంత్రానికి ఏమైనా పుంజుకుంటుందేమో చూడాలి.
ఇదిలా ఉంటే, ఈ రెండు రోజులు '118'కి అత్యంత కీలకం. ఈ రెండు రోజులు గట్టెక్కిందంటే చాలు మళ్లీ వీకెండ్‌లో కలెక్షన్లు జోరు మొదలవుతుంది. ఈ వీక్ చెప్పుకోదగ్గ సినిమాలేం లేకపోవడం '118'కి కలిసొచ్చే అంశమే. కె.వి.గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. నివేదా థామస్, షాలినీ పాండే హీరోయిన్లుగా నటించారు. 'పటాస్' తర్వాత కళ్యాణ్‌రామ్‌కి పెద్దగా హిట్స్ పడలేదు. ఈ సినిమాతో కళ్యాణ్‌రామ్ మంచి హిట్ కొట్టినట్లే. టాక్ ఇలా ఉంది కాబట్టి, ఇక ఈ వారం కూడా '118' మంచి వసూళ్లు రాబట్టడం ఖాయమని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.