నేను బాగానే ఉన్నా.. సునీల్‌!

మరిన్ని వార్తలు

కమెడియన్‌ కమ్‌ హీరో సునీల్‌ ఆరోగ్యం బాగా లేదని, తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారనీ, పరిస్థితి విషమంగా ఉందంటూ గురువారం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన అభిమానులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అసలు సునీల్‌కి ఏమైంది.? అంటూ టెన్షన్‌ పడుతున్నారు. నేను బాగానే ఉన్నా.. నా ఆరోగ్యం పట్ల ఇంతగా ఆందోళన చెందుతున్న అభిమానులకు కృతజ్ఞతలు.. అంటూ సునీల్‌ లేటెస్ట్‌గా క్లారిటీ ఇస్తూ ఓ ట్వీట్‌ చేశారు. తాజా ఫోటో కూడా పోస్ట్‌ చేశారు.

 

ఫోటోలో సునీల్‌ కాస్త నీరసంగా కనిపిస్తున్నా, ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. గొంతు ఇన్ఫెక్షన్‌ కారణంగా ఆసుపత్రిలో చేరి, చికిత్స పొందారు సునీల్‌. ఈ న్యూస్‌ బయటికి పొక్కేసరికి సీరియస్‌ ఇష్యూ అయిపోయింది. ఇక ఆయన తాజా ట్వీట్‌తో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ రోజు విడుదల కాబోతున్న 'డిస్కోరాజా' చిత్రంలో సునీల్‌ కీలక పాత్ర పోషించారు. తనపై ఇంత ప్రేమ చూపించిన అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు రిలీజయ్యే 'డిస్కోరాజా' సినిమా చూసి ఎంజాయ్‌ చేయండి.. అంటూ ట్వీట్‌ చేశారు సునీల్‌.

 

హీరోగా చేసిన ప్రయోగాలు ఫెయిల్‌ అయ్యేసరికి మళ్లీ కమెడియన్‌ అవతారమెత్తాడు సునీల్‌. కమెడియన్‌గా ఈ మధ్య చాలా సినిమాల్లో కనిపించారు. బిజీ షెడ్యూల్స్‌ కారణంగా ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ తగ్గించడంతో స్వల్పంగా అనారోగ్యానికి గురయినట్లు తెలుస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS