బాలీవుడ్ స్టార్ సన్నీలియోన్ బయోపిక్ రిలీజయ్యింది. అయితే ఈ బయోపిక్‌ని ధియేటర్‌లో రిలీజ్ చేయలేదు. ఇంటర్నెట్‌లో రిలీజ్ చేశారు. సినిమా చాలా బాగుందంటూ రివ్యూస్ వస్తున్నాయి. అందరూ చూసే సినిమా కాదు ఇది. పెయిడ్ మూవీ. అయితే ఓ పోర్న్ స్టార్ బయోపిక్ తీయడం ఎంతవరకూ సమంజసం అని ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
భారతీయ మూలాలున్న వ్యక్తి అయ్యుండి సన్నీ లియోన్ ఆ భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకే మచ్చ తెచ్చి పెట్టింది అంటూ ఆమెపై గుమ్మత్తిపోసేవారూ ఉన్నారు. 'కరణ్‌జీత్ కౌర్' అనే టైటిల్‌తో ఈ సినిమాని విడుదల చేశారు. ఇది సన్నీలియోన్ అసలు పేరు. అయితే ఆ పేరులోని 'కౌర్ 'ని తొలిగించాలంటూ కొంతమంది ఆందోళన చేస్తున్నారు. అయితే సన్నీలియోన్ బయోపిక్ అంటే అందులో ఏమేం చూపించారో, అసలు ఆమె పోర్న్ జీవితం గురించి చూపించారా లేదా.. ఇలాంటి ఆసక్తి ఉండడం సహజమే. ఆ ఆసక్తితోనే ఈ సినిమాపై క్యూరియాసిటీ బాగా పెరిగిపోయింది.
అయితే ఇది ధియేటర్లో విడుదలైన సినిమా అయితే రిజల్ట్, టాక్ మరోలా ఉండేది. అభ్యంతరాలు కూడా మరింత ఎక్కువగానే ఉండేవి. డిజటల్ ప్లాట్‌ఫాంలో విడుదలైన సినిమా కాబట్టి, ఫస్ట్ ఫస్ట్ అడ్డంకి అయిన సెన్సార్‌తో పనిలేదు. అలాగే వివాదాలు, అభ్యంతరాలు కూడా తక్కువే ఉంటాయి.
చూడాలి మరి ముందు ముందు ఏం జరుగుతుందో. హిందీతో పాటు తమిళ, తెలుగు భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేశారు. మరోవైపు సన్నీలియోన్ పోర్న్ రంగం నుండి, బాలీవుడ్‌లోకీ, బాలీవుడ్ నుండి సౌత్ సినిమాల్లోకీ సక్సెస్‌ఫుల్‌గా ఎంట్రీ ఇచ్చేసింది.