కళ్యాణ్‌రామ్ తాజా చిత్రం '118'. కేవీ గుహన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతోందనే విషయాన్ని మొదట్లోనే చెప్పారు. అయితే తాజాగా టీజర్ రిలీజ్ చేసి, శాంపిల్‌గా చూపించేశారు. కళ్యాణ్‌రామ్, షాలినీ పాండేల మధ్య ఆహ్లాదంగా సాగుతోన్న లవ్‌స్టోరీతో టీజర్ స్టార్ట్ అయ్యింది.
అయితే అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్.. షాలినీ పాండే గాయాల పాలవ్వడం, కళ్యాణ్‌రామ్ టెన్షన్లో పడడం తర్వాత, ఆ యాక్సిడెంట్‌కి సంబంధించి కూపీ లాగే క్రమంలో కళ్యాణ్‌రామ్ ఇన్వెస్టిగేషన్ అంతా ఇంట్రెస్టింగ్గా చూపించారు. ఈ ఇన్వెస్టిగేషన్ క్రమంలోనే 1.18 టైంని చూపించారు. అంటే టైటిల్లో ఉన్న '118'కి టీజర్లో చూపించిన ఈ 1.18కి ఖచ్చితంగా ఏదో సంబంధం ఉండి తీరాలి. అయితే అదేంటో మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే. సినిమాలోనే చూడాలి.
ఇదిలా ఉంటే, ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉంది. నివేదా థామస్. కానీ టీజర్లో షాలినీ పాండే, కళ్యాణ్‌రామ్ కెమిస్ట్రీ చూపించారు. కానీ నివేదాకి టీజర్లో చోటు దక్కలేదు. అంటే నివేదా క్యారెక్టర్‌కి ఏదో ఎక్కువ ఇంపార్టెన్సే ఉండి ఉండాలి. ఆమె క్యారెక్టర్ని సస్పెన్స్‌గా ఉంచారు. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లో రూపొందుతోన్న ఈ సినిమా టీజర్ అయితే ఆశక్తికరంగానే ఉంది. సినిమా ఎలా ఉండబోతోందో తెలియాలంటే మరికొంత సమయం వెయిట్ చేయక తప్పదు.