'సైరా' మేకింగ్‌ వీడియో వచ్చేసింది.

మరిన్ని వార్తలు

ప్రతీ భారత పౌరుడూ రేపు స్వాతంత్ర దినోత్సవ వేడులు ఘనంగా జరుపుకుంటాడు. కానీ, అంతకు ఒక్క రోజు ముందుగానే మెగా అభిమానులకు అసలు సిసలు పండగ వచ్చేసింది. 'సైరా' సెట్‌లో ఏం జరిగిందో ఆ విశేషాలను పంచుకుంటూ, చిత్ర యూనిట్‌ మేకింగ్‌ వీడియోని విడుదల చేసింది. ఫస్ట్‌ టీజర్‌కే సినిమా చూసినంత థ్రిల్‌ కలగజేసిన 'సైరా' టీమ్‌, మేకింగ్‌ వీడియోతో ఇప్పుడు మరోసారి మెస్మరైజ్‌ చేసింది. కీలక పాత్రధారులకు సంబంధించిన యాక్షన్‌ సన్నివేశాలతో ఈ మేకింగ్‌ వీడియోని కట్‌ చేశారు.

 

బిగ్‌బీ అమితాబ్‌, కిచా సుదీప్‌, జగపతిబాబు, విజయ్‌ సేతుపతి, తమన్నా, నయనతార, నిహారిక, రవికిషన్‌ తదితర పాత్రధారుల్ని ఒక్కొక్కరుగా చూపించారు. తమన్నా, నిహారిక కూడా యాక్షన్‌ సీన్స్‌ చేస్తున్నట్లు చూపించారు ఈ వీడియోలో. చివరిగా ఆంగ్ల సైనికులతో మెగాస్టార్‌ చిరంజీవి పోరాడుతున్న వైనం చూపించారు. అమిత్‌ త్రివేది బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌, రత్నవేలు సినిమాటోగ్రఫీ, హాలీవుడ్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్స్‌, నిర్మాత రామ్‌చరణ్‌, దర్శకుడు సురేందర్‌ రెడ్డి.. ఇలా అందరికీ ఈ వీడియోలో చోటు దక్కింది. బిగ్‌బీ అమితాబ్‌తో కలిసి పవన్‌ కళ్యాణ్‌ కనిపించడం వీడియోలో హైలైట్‌గా నిలిచింది.

టోటల్‌గా 'సైరా' మేకింగ్‌ వీడియో ఫ్యాన్స్‌కి ఫుల్‌ మీల్స్‌ పెట్టినంత తృప్తినిచ్చింది. ఇక్కడితో సైరా సందడి ఆగలేదు. ఈ నెల 20న టీజర్‌ విడుదల చేయనున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించింది చిత్ర యూనిట్‌. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకుని, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్న 'సైరా' గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS