తెలుగులో పలు గ్లామరస్ పాత్రల్లో నటించి, క్యూట్ హీరోయిన్ అనిపించుకున్న తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా గడుపుతోంది. అక్కడ స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగిపోయింది తాప్సీ. హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటించి, తాప్సీ బాలీవుడ్‌లో పాగా వేసేసింది. 'పింక్', బేబీ', 'నామ్ షబానా' తదితర చిత్రాలు తాప్సీకి నటిగా మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. అయితే తాజాగా మరో సంచలనాత్మక చిత్రంలో తాప్సీ నటించబోతోంది.
మాజీ హాకీ ప్లేయర్ సందీప్ సింగ్ బయోపిక్‌లో తాప్సీ నటిస్తోంది. హాకీ ప్లేయర్‌గా అప్పట్లో సందీప్ సింగ్ చాలా పాపులర్ క్రీడాకారుడు. ఈయన జీవిత గాధ ఆధారంగానే ఈ చిత్రం తెరకెక్కుతోంది. లేటెస్టుగా షూటింగ్ ప్రారంభమైంది ఈ సినిమా. ఇదిలా ఉండగా తాప్సీ నటించిన 'ముల్క్' అనే మరో సినిమా షూటింగ్ లేటెస్టుగా పూర్తయ్యింది. తాప్సీ కెరీర్‌లో ఇదో ప్రత్యేకమైన సినిమా అని చెబుతోంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.
ఈ లోగానే తాప్సీ మరో కొత్త సినిమా సెట్స్ మీదికెళ్లింది. అదే సందీప్ సింగ్ బయోపిక్. అయితే ఈ సినిమాకీ చాలా ప్రత్యేకతలున్నాయట. అప్పట్లో ది గ్రేట్ హాకీ ప్లేయర్ అయిన సందీప్ సింగ్‌కి ఓ యాక్సిడెంట్ కారణంగా తనకి ప్రాణమైన హాకీ ఆటకి దూరమై, దాదాపుగా రెండేళ్లు మంచానికే పరిమితమైపోవాల్సిన పరిస్థితి వస్తుందట. ఓ అమ్మాయి కారణంగా అతను ఆ పరిస్థితి నుండి కోలుకుంటాడు. ఆ అమ్మాయి పాత్రలోనే తాప్సీ నటిస్తోంది. ఈ సన్నివేశాలను చాలా హృద్యంగా తెరకెక్కించనున్నారట ఈ సినిమాలో. దిల్ జిత్ దోసాంజా అనే నటుడు సందీప్ సింగ్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం తాప్సీ హాకీ కూడా నేర్చేసుకుందట. నేర్చుకోవడమే కాదు, ప్రొఫిషనల్ ప్లేయర్‌లా సెట్స్‌లో ఆడేస్తోంది కూడానట. అదీ సంగతి. తాప్సీ లేటెస్ట్‌గా తెలుగులో 'ఆనందోబ్రహ్మ' సినిమాలో నటించింది.