షూటింగ్ పూర్తయిపోతోంది.. త్వరలో విడుదలైపోతోంది.. అంటూ ఊహాగానాలు తెరపైకి రావడంతో 'సైరా' సినిమా బిజినెస్ పైనా ఓ ప్రచారం జరుగుతోంది. రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి నటిస్తున్న రెండో సినిమా ఇది. చాలా కాలిక్యులేషన్స్ నడుమ భారీ స్థాయిలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు రామ్‌చరణ్. కొణిదెల ప్రొడక్షన్స్‌లో తెరకెక్కుతోన్న రెండో సినిమా ఇది.
తెలుగు సినిమాకి నాన్ బాహుబలి రికార్డుల పరంగా తొలిసారి వంద కోట్ల క్లబ్‌లోకి చేరిన సినిమా 'ఖైదీ'. ఓవర్సీస్‌లో కూడా మంచి వసూళ్లు సాధించింది 'ఖైదీ'. ఈ నేపథ్యంలో 'సైరా'పై అంచనాలు అనూహ్యంగా పెరిగిపోయాయి. దాంతో అన్ని ఏరియాల నుండీ ఫ్యాన్సీ ఆఫర్లు వస్తున్నాయట. చాలా వరకూ గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ సొంతం చేసుకునే అవకాశముంది. మరోపక్క ఓవర్సీస్ నుండి 40 కోట్లతో ప్రతిపాదనలు వస్తున్నాయట.
అయితే ఇప్పుడే ఫైనల్ చేయడం తొందరపాటు అవుతుందని చరణ్ అనుకుంటున్నాడట. కానీ ఓ ఫ్యాన్సీ ఆఫర్ వస్తే దాన్ని తిరస్కరించిన చరణ్ 40 కోట్ల పైనే డిమాండ్ చేస్తున్నాడంటూ ఓవర్సీస్ అమ్మకాలకు సంబంధించి తాజాగా ఓ గాసిప్ వినిపిస్తోంది. ఈ గాసిప్‌లో నిజమెంతో కానీ మెగాస్టార్ చిరంజీవి సినిమా కాబట్టి, అందునా భారీ బడ్జెట్ మూవీ కాబట్టి ఇలాంటి గాసిప్స్ సహజమే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది.