'అల వైకుంఠపురములో' నుండి అందాల తార.!

By Inkmantra - November 04, 2019 - 12:16 PM IST

మరిన్ని వార్తలు

'కూలీ నెంబర్‌ వన్‌' చిత్రంతో తెలుగు ప్రేక్షలకు పరిచయమైన బ్యూటీ టబు. తన అందంతో ఎందరో కుర్ర హృదయాల్ని కొల్లగొట్టేసింది ఆ సినిమాతో టబు. ఆ తర్వాత నాగార్జునతో నటించిన 'నిన్నే పెళ్లాడతా' సినిమాతో చాలా మందికి డ్రీమ్‌ గాళ్‌ అయ్యింది. ఇక ఆ తర్వాత టాప్‌ హీరోయిన్‌గా తెలుగులో చాన్నాళ్లు వెలుగొందింది. సీనియర్‌ నటి అయ్యాకా కూడా, చిరంజీవితో 'అందరి వాడు', బాలయ్యతో 'పాండురంగడు' వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది అందాల భామ టబు. లాంగ్‌ గ్యాప్‌ తర్వాత ఇప్పుడు మెగా హీరో అల్లు అర్జున్‌ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది.

 

ఈ సినిమాలో టబు కీలక పాత్ర పోషిస్తోంది. ఆమె పాత్ర ఎలాంటిది అనేది తెలియదు కానీ, ఏజ్డ్‌లోనూ, ఫుల్‌ గేజ్‌తో ఆకట్టుకుంటోంది. ఏమాత్రం తరగని అందం, ఫిజిక్‌తో కేక పుట్టిస్తోంది. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్‌ పూజా హెగ్దే. కానీ, అందంలో పూజాకి గట్టి పోటీ కానుందనిపిస్తోంది టబు. ఈ రోజు ఆమె పుట్టినరోజు కావడంతో, 'అల వైకుంఠపురములో..' నుండి టబు లుక్‌ రిలీజ్‌ చేశారు.

'ఆమె చూపులు మన హృదయాల్ని కొల్లగొడతాయి.. ఆమె టాలెంట్‌తో ఎంతటి వారినైనా ఆకట్టుకోగలదు.. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు..' అంటూ చిత్ర యూనిట్‌ ఈ లుక్‌ రిలీజ్‌ చేసింది. చెప్పాల్సిందంతా వారే చెప్పేశారు. ఇక మనం చెప్పడానికేముంది చెప్పండి. ఆమె అందానికి దాసోహం అనడం తప్ప. ఈ లుక్‌ చూసి ఎంజాయ్‌ చేస్తూ మనం కూడా టబుకి 'హ్యాపీ బర్త్‌డే' చెప్పేద్దామా.. విష్‌ యు మెనీ మోర్‌ హ్యాపీ బర్త్‌డే టు డ్రీమ్‌ గాళ్‌ టబు.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS