హుందా అయిన పాత్రలే కాదు, బోల్డ్‌గా నటించడానికైనా ఎలాంటి అభ్యంతరాల్లేవు ఈ ముద్దుగుమ్మకి. ఎవరింతకీ ఈ హాట్ భామ అనుకుంటున్నారా.? 'తడాఖా' సినిమాలో సునీల్‌కి జోడీగా నటించిన ముద్దుగుమ్మ ఆండ్రియా. తమిళంలో పలు చిత్రాల్లో నటించింది. పలు హీరోలతో అఫైర్లు అంటూ గాసిప్స్ కూడా ఈ ముద్దుగుమ్మ విషయంలో కూసింత ఎక్కువే మరి. సిద్దార్ద్‌తో కలిసి 'గృహం' సినిమా కోసం ఓవర్ డోస్‌లో అందాలారబోసేసింది.
తాజాగా ఆండ్రియా జెరేమియా ఓ స్పెషల్ ఫోటో షూట్ చేయించుకుంది. ఆ పిక్సే ఇప్పుడు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. మొన్నీ మధ్య ఇలాంటి డ్రస్సు వేసుకున్నందుకే రకుల్ ప్రీత్‌సింగ్‌ని (ప్యాంటు వేసుకోవడం మర్చిపోయావా..అంటూ) ఓ ఆట ఆడేసుకున్నారు నెటిజన్లు. ఇప్పుడేమో ఈ బ్యూటీ స్టైల్‌గా కళ్లకు గాగుల్స్ పెట్టుకుని మరీ వయ్యారాలు పోతోంది. ఇక ఆఛ్ఛాదనే లేకుండా ఎద భాగాన్ని అంతగా ఎక్స్పోజ్ చేయడంలో అమ్మడి ఆంతర్యమేంటో.! ఆమెకే తెలియాలి మరి.