పవన్‌ - రేణూ మళ్లీ కలవబోతున్నారా.?

మరిన్ని వార్తలు

పవన్‌ కళ్యాణ్‌ - రేణూదేశాయ్‌ జంట మళ్లీ కలవబోతున్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య రేణూ దేశాయ్‌ రెండో పెళ్లి, ఎంగేజ్‌మెంట్‌.. అంటూ హడావిడి చేసింది. కానీ ఆ పెళ్లి ఊసే లేదిప్పుడు. అసలా వరుడి సంగతి కూడా తెలీదింతవరకూ. లేటెస్ట్‌గా రేణూదేశాయ్‌ సినిమాలపై ఫోకస్‌ పెట్టినట్లు ప్రకటించింది. ఆల్రెడీ ఓ సినిమాకి సైన్‌ చేసింది కూడా. 

 

ఇదిలా ఉంటే, రేణూదేశాయ్‌కి నటనలోనే కాకుండా, సినిమాకి సంబంధించిన ఇతర విభాగాల్లో కూడా అవగాహన ఉన్న సంగతి తెలిసిందే. దర్శకురాలిగా, నిర్మాతగా, కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా, ఎడిటింగ్‌.. ఇలా పలు విభాగాల్లో అన్న మాట. కాసేపు ఈ విషయం పక్కన పెడితే, పవన్‌ కళ్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ పేరుతో ఓ నిర్మాణ సంస్థ ఉన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. అయితే పవన్‌ రాజకీయాల్లోకి వెళ్లాక, ఈ నిర్మాణ సంస్థ కామ్‌అప్‌ అయిపోయింది. 

 

తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఈ నిర్మాణ సంస్థ బాధ్యతలు ఇకపై రేణూ తీసుకోనుందని తెలుస్తోంది. పవన్‌ కళ్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ బ్యానర్‌లో కొన్ని సినిమాలు రూపొందించాలనుకుంటోందట. పవన్‌ కళ్యాణ్‌ నుండి కూడా అందుకు సమ్మతమే అని తెలుస్తోంది. ఈ రకంగా పవన్‌ - రేణూ మళ్లీ కలవబోతున్నారని గట్టిగా ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS