అరడజనుకు పైగా చిత్రాలు ఈ శుక్రవారం విడుదలైనప్పటికి మెంటల్ మదిలో & బాలకృష్ణుడు చిత్రాలనే చూడడానికి ఎక్కువ మంది ప్రేక్షకులు ఆసక్తి చూపారు.
మెంటల్ మదిలో విషయానికి వస్తే, యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి తీసుకున్న కథా వస్తువు అందరికి బాగా నచ్చేస్తుంది. రెండిట్లో ఒకటి తేల్చుకోవాల్సి వచ్చినప్పుడు తలెత్తే సమస్యని అత్యద్బుతంగా తెరకెక్కించాడు. ఇక అలాగే నటీనటులు- శ్రీవిష్ణు, నివేథా పెతురాజ్ ల నటన ఈ సినిమాని మరోస్థాయికి తీసుకెళ్ళింది అని చెప్పొచ్చు.
నవతరం దర్శకుల్లో ఇంతటి ప్రతిభ కనబరుస్తుండడం తెలుగు సినిమా భవిష్యత్తు పైన భరోసాని పెంచుతుంది.
ఇక రెండవ చిత్రం బాలకృష్ణుడు. నారా రోహిత్ మొదటిసారిగా ఒక పూర్తీ కమర్షియల్ చిత్రంగా ఎంచుకుని చేసిన చిత్రం ఇది. ఇటువంటి కమర్షియల్ చిత్రాలలో పెద్దగా కథ లేకపోయినా ఎంటర్టైన్మెంట్ తో సాగిపోతుంది. ఇలాంటి చిత్రంలో బాగానే ఒదిగిపోయాడు మన హీరో, అలాగే కమెడియన్ పృథ్వీ మరోసారి తన మార్కు హాస్యంతో రెచ్చిపోయాడు అనే చెప్పాలి.
దర్శకుడు కూడా ఒక కమర్షియల్ చిత్రం ఎలా తీయాలో అలానే తీసాడు. దీనితో ఈ వారం కమర్షియల్ చిత్రాలని చూడాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్ అనే చెప్పొచ్చు.
ఇది ఈ వారం www.iQlikmovies.com టాక్ అఫ్ ది వీక్.