ఈ వారం విడుదలైన రెండు చిత్రాలలో ఒకటి స్ట్రెయిట్ ఫిలిం కాగా మరొకటి హిందీ చిత్రం రీమేక్. హీరో సుమంత్ నటించిన మళ్ళీ రావా స్ట్రెయిట్ చిత్రం కాగా సప్తగిరి నటించింది హిందీ సినిమా రీమేక్.
ముందుగా సప్తగిరి సినిమా విషయానికి వస్తే, హిందీలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న జాలీ LLB చిత్రానికి ఇక్కడ నేటివిటీ కి తగ్గ మార్పులు చేసి ఈ చిత్రాన్ని తీసారు. అయితే ఈ సినిమాకి వెన్నుముక అయిన కోర్టు సన్నివేశాలని అలానే ఉంచేసి ఎంటర్టైన్మెంట్ పోర్షన్స్ మాత్రం వీరు అందులో జోడించారు.
ఇక సినిమా పరంగా ఇది బాగానే ఉన్నా, హిందీలో దీని మాతృక చూసిన వారికి ఇది నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఆ సినిమా తాలుకా ప్రభావం అంతలా ఉంటుంది. నటన, డాన్సులు పరంగా సప్తగిరి మంచి మార్కులే వేయించుకున్నాడు. మొత్తానికి ఈ సినిమాకి యావరేజ్ టాక్ సొంతం అయింది.
ఈ వారంలో వచ్చిన రెండవ చిత్రం అయిన మళ్ళీ రావా గురించి మాట్లాడుకుంటే- ఇది ఒక అందమైన ఫీల్ కలిగిన లవ్ స్టొరీ అని చెప్పొచ్చు. సుమంత్ కూడా చాలా చక్కగా ఒదిగిపోయాడు పాత్రలో. రెగ్యులర్ ప్రేమ కథనే తీసుకున్నప్పటికీ దర్శకుడు గౌతం ఆ కథని మనకి చూపించిన విధానం కొత్తగా అనిపిస్తుంది.
మొదటి సినిమా అయినప్పట్టికి దర్శకుడు ఈ చిత్రాన్ని చాలా బాగా తెరకెక్కించాడు. దీనికి తోడు చక్కటి సంగీతం, నటీనటుల నటన ఈ సినిమా అందరికి గుర్తుండిపోయేలా చేస్తుంది. సుమంత్ కి కూడా చాలా కాలం తరువాత ఒక మంచి హిట్ వచ్చింది అని చెప్పొచ్చు.
ఇది ఈ వారం www.iQlikmovies.com టాక్ అఫ్ ది వీక్.