మహేష్‌బాబు మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి దిగాడు. ఏఎంబీ పేరుతో హైదరాబాద్‌లో ఓ మల్టీప్లెక్స్ నిర్వహిస్తున్నాడు మహేష్ బాబు. ఏసియన్ సినిమాస్ సంస్థతో భాగస్వామిగా మారి ఈ మల్టీప్లెక్స్ కట్టాడు మహేష్. అల్లు అర్జున్ కూడా హైదరాబాద్‌లో ఓ మల్టీప్లెక్స్ కట్టడానికి ప్లాన్ వేస్తున్నాడు. దీనికి కూడా ఏసియన్ సినిమాస్ సహకారం అందిస్తోంది. ఇప్పుడు ఎన్టీఆర్ వంతు వచ్చింది. ఎన్టీఆర్ కూడా అర్జెంటుగా ఓ మల్టీప్లెక్స్ కట్టాలని స్కెచ్ వేస్తున్నాడట.
విశాఖపట్నంలో గానీ, ఏపీ కొత్త రాజధాని అమరావతిలో గానీ ఈ మల్టీప్లెక్స్ ఉండొచ్చని టాక్. అగ్ర కథానాయకులు సైడ్ బిజినెస్‌గా ఏదో ఓ వ్యాపకం చూసుకోవడం మామూలే గానీ, ఎన్టీఆర్‌కి మాత్రం అలాంటి వ్యవహారాలేం లేవు. కానీ సినిమా పరిశ్రమలో భాగమైన ఈ మల్టీప్లెక్స్ నిర్వహణపై మగ్గు చూపిస్తున్నాడని టాక్. ప్రస్తుతం అనుమతుల కోసం ధరఖాస్తు చేస్తున్నారని, త్వరలోనే మంచి స్థలం చూసి మల్టీప్లెక్స్ నిర్మాణానికి ముహూర్తం ఫిక్స్ చేస్తారని టాక్.