తమిళ హీరో కార్తీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నాడు. పలానా పార్టీ తరపున ప్రచారానికి దిగబోతున్నాడంటూ ఈ మధ్య కోలీవుడ్‌లో వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదనీ, తాను ఏ రాజకీయ పార్టీకీ మద్దతివ్వడం లేదనీ, ఏ రాజకీయ పార్టీ ప్రచారంలోనూ పాల్గొనడం లేదనీ కార్తీ స్పష్టం చేశారు. ఓటరుగా మాత్రం తన బాధ్యత తాను నిర్వర్తిస్తానని కార్తి ట్విట్టర్ ద్వారా స్పందించారు.
ప్రస్తుతం తమిళనాట రాజకీయాలు గరం గరంగా ఉన్న సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమ నుండి పలువురు సినీ ప్రముఖులు ఎలక్షన్స్ బరిలో దిగుతున్నారు. ఈ క్రమంలోనే కార్తీపై ఈ మధ్య గాసిప్స్ హల్చల్ చేశాయి. సో తాజా ట్వీట్‌తో రాజకీయాల్లో కార్తీపై వచ్చిన గాసిప్స్‌కి చెక్ పడతాయేమో చూడాలి మరి. మరోవైపు కార్తీ కెరీర్‌పైనే ఫుల్‌గా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
ఇటీవల 'దేవ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన కార్తీ, ఆశించిన రీతిలో ఆకట్టుకోలేకపోయాడు. ప్రస్తుతం రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అందులో ఓ ప్రాజెక్ట్‌కి చిరంజీవి సూపర్ హిట్ మూవీ అయిన 'ఖైదీ' టైటిల్‌ని ఫిక్స్ చేసి, అధికారికంగా ఈ మధ్యనే అనౌన్స్ చేశారు. దీంతో పాటు ఇంకో సినిమా కూడా కార్తీ చేతిలో ఉంది. ఈ సినిమాలో కార్తీ సరసన క్రేజీ బ్యూటీ రష్మికా మండన్నా నటిస్తోంది.