విశాల్‌కి కాబోయే భార్య ఎవరో తెలుసా.?

మరిన్ని వార్తలు

తమిళ హీరో విశాల్‌ పెళ్లి చేసుకోబోతున్నారనీ గతంలో ఆయన తండ్రి ప్రముఖ నిర్మాత జీకే రెడ్డి మీడియా ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. హైద్రాబాద్‌కి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త కూతురు అనీషాతో విశాల్‌ వివాహం త్వరలో జరగనుంది. ఈ నెల్లోనే నిశ్చితార్ధం జరగనుందట. హైద్రాబాద్‌లో ఘనంగా నిశ్చితార్ధం జరిపేందుకు పెద్దలు నిశ్చయించినారట. 

 

ఇకపోతే విశాల్‌కి కాబోయే భార్య ఎవరో తెలుసా.? 'పెళ్లి చూపులు' సినిమాలో విజయ్‌ దేవరకొండతో కలిసి నటించింది. హీరోయిన్‌గా కాకపోయినా, ఆ సినిమాలో ఓ ఇంపార్టెంట్‌ రోల్‌ పోషించింది ఈమె. అలాగే 'అర్జున్‌రెడ్డి'లోనూ ఓ చిన్న పాత్రలో మెరిసింది. 'కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాను. నా ఎదుగుదలలో, ఆలోచనల్లో స్పూర్తిగా నిలిచినందుకు మీకు ధన్యవాదాలు. 

 

కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు నాకు ఒక తోడు దొరికింది. విశాల్‌ మంచి మనసు నాకు నచ్చింది. విశాల్‌తో జీవితం పంచుకుని, ఆయన్ను సంతోషంగా ఉంచడానికి నా బెస్ట్‌ నేను ప్రయత్నిస్తాను..' అంటూ అనీషా సోషల్‌ మీడియాలో పేర్కొంటూ విశాల్‌తో కలిసి సరదాగా దిగిన ఫోటో పోస్ట్‌ చేసింది. అన్నట్లు వీరిద్దరి వివాహం హైద్రాబాద్‌లోనే జరగనుందని విశాల్‌ తండ్రి తెలిపారు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS