'భలే భలే మగాడివోయ్' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు మారుతి. ఈ సినిమాతో మారుతితో పాటు, యంగ్ హీరో నాని కెరీర్ కూడా టర్న్ అయిపోయింది. మతిమరుపు కాన్సెప్ట్‌తో మారుతి హిట్ కొట్టి చూపించాడు. ఇదే ఫార్ములాని తర్వాతి చిత్రాలకు కూడా కొనసాగించాడు. కానీ 'మహానుభావుడు' వర్కవుట్ అయ్యింది. కానీ 'శైలజారెడ్డి అల్లుడు'కు అంతగా గిట్టుబాటు కాలేదు. ఈ సారి మారుతి తన హీరోకి ఏం కష్టం పెట్టబోతున్నాడో కానీ, మారుతితో సినిమా చేయాలని ఈ మధ్య యంగ్ హీరోలు తెగ ఉబలాటపడిపోతున్నారట.
హిట్, ఫట్ అనే సంగతి పక్కన పెడితే మారుతి అంటే మినిమమ్ గ్యారంటీ అనే పేరుంది. అందుకే ఓ మోస్తరు ఫేమ్ ఉన్న యంగ్ హీరోలు మారుతితో సినిమాకి సై అంటున్నారట. అయితే మారుతి నెక్స్ట్ హీరో ఎవరనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. కానీ ఓ యంగ్ హీరోతో మారుతి చర్చలు జరుపుతున్నాడనీ సమాచారమ్. నిజానికి మారుతి లిస్టులో విజయ్‌దేవరకొండ, సాయిధరమ్ తేజ్ తదితర హీరోలున్నారు. అయితే వీరికి కథల విషయంలో చర్చలు జరుగుతున్నాయి.
దర్శకుడిగా మారుతి ఖాళీగానే ఉన్నా, ఆయా హీరోలు మాత్రం తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే మారుతి ఈ సారి ఓ కొత్త కాన్సెప్ట్‌తో కుస్తీ పట్టనున్నాడట. హీరో కన్ఫామ్ అయితే ఆ కాన్సెప్ట్ ఏంటో చెబుతానంటున్నాడు. మరి మారుతికి ఏ హీరోతో డీల్ సెట్ అవుతుందో అసలింతకీ మారుతి పరిచయం చేయబోయే ఆ కొత్త కాన్సెప్ట్ ఏంటో తెలియాలంటే ఇంకొంత సమయం వేచి చూడాల్సిందే.