మెగా సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ కి తేజ్ ఐ లవ్ యు చిత్రం రూపంలో ఫ్లాపులలో డబల్ హ్యాట్రిక్ కొట్టేశాడు.
సినిమాకి తొలి షో నుండే ఫ్లాప్ టాక్ రావడం మొదలవగా అది మిగతా షోల పైన తీవ్ర ప్రభావం చూపింది. దీనితో ఈ సినిమా మొదటిరోజు కలెక్షన్స్ రెండు తెలుగు రాష్ట్రాలలో రూ 2 కోట్ల షేర్ కూడా దాటలేకపోయినట్టు సమాచారం. ఈ కలెక్షన్స్ తేజ్ గత చిత్రం ఇంటెలిజెంట్ కన్నా తక్కువగా నమోదు కావడం గమనార్హం.
ఇప్పటికే ఫ్లాపుల మీద ఫ్లాపులతో కెరీర్ లో చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న సాయి ధరంకి ఈ చిత్రం మరొక ఎదురుదెబ్బలా తగిలింది. మంచి పేరున్న దర్శకుడు కరుణాకరన్ అలాగే హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ వంటి చాలా ప్లస్ అంశాలు ఉన్నప్పటికి ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద తొలిరోజే బోల్తాకోట్టేసింది.
ఏదేమైనా.. తేజ్ మంచి ప్రతిభ ఉన్న నటుడు కావడంతో ఆయన కెరీర్ కి వచ్చిన ఇబ్బందేం లేదు అని చెప్పొచ్చు.