ఇప్పుడంతా డిఫరెంట్ ఆలోచనలతో ఎమోషనల్ టచ్‌తో కూడిన సినిమాలకే ప్రేక్షకులు అలవాటు పడ్డారు. అదే సమయంలో దర్శక, నిర్మాతలు, నటీనటులు కూడా అలాంటి సినిమాల గురించే ఆలోచిస్తున్నారు. సరిగ్గా ఇదే టైంలో కొంచెం కొత్తగా అంటూ దర్శకుడు తేజ 'సీత' సినిమా తెరకెక్కించాడు. ఈ 'సీత' బీభత్సమైన ఫైటింగులు కూడా చేసేస్తోంది.
సీత పాత్రలో కాజల్ నటిస్తోంటే, ఆమెకు అడుగడుగునా సాయపడుతుంటాడు రాముడి లాంటి కుర్రాడు బెల్లంకొండ శ్రీనివాస్, రేపే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, దీంతో పాటు ఓ మంచి కమర్షియల్ సినిమా కథని తేజ, బెల్లకొండకు చెప్పాడట. సాధారణంగా కమర్షియల్ కథల వైపే ఆశక్తి చూపే బెల్లంకొండ సీత వంటి కథను ఎంచుకోవడం ఆశ్చర్యకరమే.
తేజతో ట్రావెల్ మొదలయ్యాక ఆయనతోనే ఇంకో సినిమా అది కూడా వెంటవెంటనే చేయాలనీ బెల్లంకొండ నిర్ణయించుకున్నాడట. సీత ఔట్ పుట్ చూసుకున్నాక ఆ ఆలోచన మరింత బలపడిందట. వీలైనంత త్వరగా తేజ దర్శకత్వంలోనే ఇంకో సినిమాని అనౌన్స్ చేయాలనే ఆలోచనలో బెల్లంకొండ ఉన్నాడనీ సమాచారమ్. ఈ ప్రాజెక్ట్‌పై అతి త్వరలోనే క్లారిటీ రాబోతోంది.