బుల్లితెర మెగా రియాల్టీ షో 'బిగ్‌బాస్' సీజన్ 2కి సంబంధించిన డ్యామేజ్ అంతా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నానిపై పడుతుంది. తాజాగా హౌస్ నుండి బయటికి వచ్చిన తేజస్విని నానిపై విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. హౌస్‌లో ఉన్నంత సేపు నాని, తేజస్వినిని పలు రకాల అంశాలపై వార్నింగ్స్ ఇస్తూ వచ్చారు. తన ప్రవర్తన మార్చుకోమని హెచ్చరించారు.
ఆ కారణంగా ఆయనపై తేజు విమర్శలు చేస్తుందో ఏమో కానీ, తేజు వెర్షన్ ఏంటంటే, బిగ్‌బాస్ నిర్వాహకులు ఎడిట్ చేసిన వెర్షన్‌ని చూసి నాని తనది తప్పు అని తేల్చేస్తున్నాడు. అందుకు తనకు చాలా బాధగా ఉంది.. అని తేజు బయటికి వచ్చాక చెబుతోంది. అయితే నాని మాత్రం తాను ఎడిట్ చేసిన వెర్షనే చూడడం లేదు. రా పుటేజ్ చూసిన తర్వాతే హౌస్‌లోని సభ్యులను అందుకు అనుగుణంగా సలహాలైనా, వార్నింగ్స్ అయినా ఇవ్వడం జరుగుతోంది అని చెబుతున్నాడు. ఎడిట్ చేసిన వెర్షన్ చూసే ప్రేక్షకులు ఇంటి సభ్యులను అపార్ధం చేసుకోకూడదనే ఉద్దేశ్యంతోనే వారిలోని తప్పొప్పులను ఎత్తి చూపిస్తున్నాను అని నాని గతంలోనే తన వెర్షన్ చెప్పాడు.
అలాంటిది తేజు నానిపై ఇలాంటి విమర్శలు చేయడం పట్ల అంతరార్ధం ఏమై ఉంటుందో. నాని మీద ఇలాంటి ఆరోపణలు ఇంతవరకూ బయటికి వచ్చిన కంటెస్టెంట్స్ ఎవరూ చేయలేదు. నానిపై ఇలా విమర్శలు చేసిన ఫస్ట్ కంటెస్టెంట్ తేజునే. ఇక్కడ గమనించాల్సిందేమంటే, ఫస్ట్ సీజన్‌ని రన్ చేసిన ఎన్టీఆర్‌కి ఇలాంటి సమస్య ఎప్పుడూ రాలేదు.