మార్చి 1న అజిత్‌ `విశ్వాసం`

మరిన్ని వార్తలు

'వీరం', 'వేదాళం', 'వివేకం' వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల త‌ర్వాత హీరో అజిత్‌, డైరెక్ట‌ర్ శివ కాంబినేష‌న్‌లో రూపొందిన యాక్ష‌న్ డ్రామా 'విశ్వాసం'. ఇటీవ‌ల సంక్రాంతి సందర్భంగా విడుద‌లైన ఈ చిత్రం త‌మిళ‌నాట సెన్సేష‌న‌ల్ విజ‌యాన్ని ద‌క్కించుకుంది. అజిత్ స‌ర‌స‌న లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రాన్ని స‌త్య‌జ్యోతి ఫిలింస్ అసోషియేష‌న్‌తో ఎన్‌.ఎన్‌.ఆర్ ఫిలింస్ ప‌తాకంపై ఆర్‌.నాగేశ్వ‌ర‌రావు తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. ఇందులో టాలీవుడ్‌కి చెందిన విల‌క్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టించారు. అనువాద కార్య‌క్ర‌మాల‌న్నింటినీ పూర్తి చేసి ఈ చిత్రాన్ని మార్చి 1న విడుద‌ల చేయ‌నున్నారు. 

 

ఈ సంద‌ర్భంగా .. ఎన్‌.ఎన్‌.ఆర్ ఫిలింస్ అధినేత ఆర్.నాగేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ - "హీరో అజిత్ సినిమాల‌కు త‌మిళ‌నాడులోని క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయన సినిమా విడుద‌లంటే అక్క‌డ పండుగ వాతావర‌ణ‌మే. అజిత్, శివ కాంబినేష‌న్‌లో వచ్చిన నాలుగో బ్లాక్ బస్ట‌ర్ విశ్వాసం. ఎందరో నిర్మాత‌లు ఈ సినిమా తెలుగు హ‌క్కుల కోసం పోటీ ప‌డ్డారు. ఫ్యాన్సీ ఆఫ‌ర్‌తో తెలుగు హ‌క్కుల‌ను ద‌క్కించుకున్నాను. అవ‌కాశం ఇచ్చిన స‌త్య‌జ్యోతి ఫిలింస్ వారికి నా ధన్య‌వాదాలు. త‌మిళ‌నాడులో ఆల్ టైం రికార్డును క్రియేట్ చేసిన ఈ చిత్రం తెలుగులో కూడా సెన్సేష‌న‌ల్ స‌క్సెస్ అవుతుంది" అని అన్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS