'మహానాయకుడు' సినిమాపై బాలయ్య చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. 'కథానాయకుడు' సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా, 'ఎన్టీఆర్ మహానాయకుడు' సినిమాని ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు బాలయ్య. ఈ బయోపిక్ విషయంలో కమర్షియల్ ఆలోచనలు అస్సలు చేయలేదు. చరిత్రను చరిత్రలాగే చూపించాలనుకున్నాం. అదే చేశాం.. అని బాలయ్య అన్నారు. అయితే డిస్ట్రిబ్యూటర్లు దారుణంగా నష్టపోయారు కదా అని అడిగితే, వారిని ఆదుకోవడం నా బాధ్యత. ఆదుకుంటాను అన్నారు. 'కథానాయకుడు' అయినా, 'మహానాయకుడు' అయినా రెండూ నిజమైన చరిత్రలే.
ఈ రెండు సినిమాలూ చాలా మందికి ఆదర్శం కావాలి. 'నాన్న అందరికీ తెలుసు. అమ్మ తెలీదు కదా. అమ్మా, నాన్నల మధ్య అనుబంధం, నాన్న ఆ స్థాయికి ఎదగడానికి అసలు బలం అమ్మ. అదే ఈ బయోపిక్‌లో చూపించాం. ఆ ఉద్దేశ్యంతో అమ్మ పాత్రను మొదటి నుండీ, చివరి వరకూ ఉండాలనుకున్నాం. అదే చేశాం..' అని బాలయ్య 'మహానాయకుడు' సినిమా విషయంలో వివరణ ఇచ్చారు. 'కథానాయకుడు' సినిమా విడుదల తర్వాత బాలకృష్ణ స్పందించడం ఇదే తొలిసారి. బాలయ్య వ్యాఖ్యలతో అంతకు ముందు 'కథానాయకుడు' రిజల్ట్ ఎలా ఉన్నా, రేపు విడుదల కానున్న 'మహానాయకుడు'పై అంచనాలు పెరిగాయి.