సెగలు పుట్టిస్తోన్న 'కాటమరాయుడు' భామ

By iQlikMovies - March 31, 2018 - 13:44 PM IST

మరిన్ని వార్తలు

పవన్‌ కళ్యాణ్‌ సినిమా 'కాటమరాయుడు'లో పవన్‌ - శృతిహాసన్‌ జంటతో పాటు, తమ్ముళ్లుగా నటించిన శివబాలాజీ, అజయ్‌, నందు తదితర యంగ్‌ హీరోలకు కూడా జంటలున్నాయి. ఆ జంటల్లో ఒకరికి జోడీగా నటించిన ముద్దుగుమ్మ యామినీ భాస్కర్‌.  

గుర్తు తెచ్చుకోవడం కొంచెం కష్టమే కానీ, ఈ ఫోటో చూడండి. అయినా గుర్తు పట్టలేరు కానీ, గుర్తు పట్టడం సంగతి పక్కన పెడితే, ఈ ముద్దుగుమ్మకి సోషల్‌ మీడియాలో కొంచెం సెకలు ఎక్కువేనండోయ్‌. చూశారుగా ఈ ఫోటోలో అమ్మడి హాట్‌నెస్‌. ఇలాంటి హాట్‌ హాట్‌ ఫోటో సెషన్స్‌ చాలానే చేయించుకుందీ బ్యూటీ. 'కాటమరాయుడు' తర్వాత ఇప్పుడిప్పుడే ఈ బ్యూటీ అవకాశాలు దక్కించుకుంటోంది. అందులో భాగంగానే 'భలే మంచి చౌక బేరం' అనే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. డైరెక్టర్‌ మారుతి కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న చిత్రమిది. 

త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ ఫోటో విషయానికి వస్తే, రెడ్‌ హాట్‌ షార్ట్‌ ఫ్రాక్‌లో ఈ కాటమరాణి పుట్టిస్తోన్న హీటుకు కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. అన్నట్లు ఈ బ్యూటీ గతంలో బుల్లితెరపై ఓ ప్రముఖ ఛానెల్‌కి ప్రచార కర్తగా కూడా వ్యవహరించిందండోయ్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS