ప్రతిభావంతులు చాలామందే ఉంటారు. కానీ వాళ్లలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేవాళ్లు చాలా అవసరం. అలాంటివాళ్లు ఎంతమంది ఉంటే, పరిశ్రమ అంతగా కళకళలాడుతుంది. రాజ్ కందుకూరి కూడా చాలా మందిలోని ప్రతిభ వెలికితీశారు. దర్శకుల్ని, నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్నీ చిత్రసీమకు అందించారు. ఇప్పుడు క్రేజీ డైరెక్టర్‌గా చలామణీ అవుతున్న తరుణ్ భాస్కర్ కూడా రాజ్ కందుకూరి ప్రాడెక్టే. అందుకే రాజ్ నా గాడ్ ఫాదర్ అని సగర్వంగా చెప్పుకున్నాడు రాజ్ తరుణ్.
రాజ్ కందుకూరి నిర్మాతగా తెరకెక్కిన చిత్రం `చూసీ చూడండనే`. ఈ శుక్రవారం విడుదల అవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ "కొత్తగా సినిమా చేద్దాం అంటే ఎంకరేజ్ చేసే వాళ్ళ కంటే వెక్కిరించే వాళ్లే ఎక్కువ. అలాంటిది నా కథను నమ్మి ఒక గాడ్ ఫాదర్ లాగా ఉండి నాకు జీవితాన్ని ఇచ్చారు రాజ్ కందుకూరి. 'పెళ్లిచూపులు' అనేది ఒక మిరాకిల్. ఆయన దేవుడు లాంటి వాడు. నేనిప్పుడు ఇలా ఉన్నానంటే కారణం ఆయనే. అలాంటి దేవుడిని తండ్రిగా కలిగి ఉండటం శివ అదృష్టం. శివ మంచి టేస్ట్ ఉన్న వ్యక్తి .శేష సింధు గారు ఈ సినిమాని చాలా బాగా తీశారు అని వినిపిస్తోంది" అన్నారు.