కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు థియేటర్లు మూత బడ్డాయి. ఏప్రిల్ నుంచి.. కొత్త సినిమాల హడావుడేం లేదు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ని ఎత్తేసింది. థియేటర్లు తెరచుకోవడానికి తమకెలాంటి అభ్యంతరం లేదని చెప్పేసింది.అయితే... ఏపీలో మాత్రం థియేటర్లు తెరచుకోవడంపై ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. దాంతో నిర్మాతలు వెయిటింగ్ మోడల్ లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా లాక్ డౌన్‌నిబంధనల్ని సడలిస్తూ.. థియేటర్లు తెరచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈరోజు జగన్ ప్రభుత్వం సరికొత్త లాక్ డౌన్ నిబంధనల్ని, సడలింపుల్ని ప్రకటించింది. అందులో భాగంగా థియేటర్లు తెరచుకోవడానికి అనుమతులు ఇచ్చింది. అయితే 50 శాతం సిట్టింగ్ కే అవకాశం కల్పించింది. ఈనెల 8 నుంచి ఏపీలో థియేటర్లు తెరచుకోవొచ్చు. సో... వచ్చే వారం నుంచి కొత్త సినిమాల హడావుడి మొదలు అవుతుంది. తెలంగాణలో.. 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుపుకోవచ్చు. కాబట్టి.. చిన్న, మీడియం రేంజు సినిమాలకు ఎలాంటి అడ్డంకీ ఉండదు. ఏపీలోనూ.. 100 శాతం ఆక్యుపెన్సీకి గ్రీన్ సిగ్నల్ వస్తే.. అప్పుడు పెద్ద సినిమాలూ వరుస కడతాయి. ఈనెలాఖరులోగా... ఏపీలోనూ 100 శాతం ఆక్యుపెన్సీ కలిపించొచ్చని టాలీవుడ్ టాక్.