రియల్‌ హీరోస్‌కి రీల్‌ హీరోస్‌ అశ్రు నివాళి.!

By iQlikMovies - February 15, 2019 - 16:30 PM IST

మరిన్ని వార్తలు

జమ్ము కాశ్మీర్‌లో గురువారం మద్యాహ్నం ముష్కరులు జరిపిన ఆత్మాహుతి దాడిలో మన దేశానికి చెందిన 42 మంది జవానులు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దేశం మొత్తం ఉలిక్కి పడింది. వీరజవానుల మృతికి తీవ్ర సంతాపం తెలిపింది. ఈ దుర్ఘటనపై రీల్‌ హీరోలు సోషల్‌ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. 

 

హీరో నాని ఈ విషయం తెలియగానే షాక్‌ అయ్యాను, గుండె బరువెక్కిపోయింది.. వీర మరణం పొందిన జవాన్లకు నా అశ్రు నివాళి..' అని ట్వీట్‌ చేశాడు. మరో యంగ్‌ హీరో నిఖిల్‌ ఈ వార్త విని నిద్రపోలేకపోయానని చెప్పి, ఓ జవాన్‌ హార్ట్‌ టచ్చింగ్‌ పోయమ్‌ని ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేసి, దేశభక్తిని చాటుకున్నాడు. అలాగే సాయి ధరమ్‌తేజ్‌, నితిన్ తదితర హీరోల సోషల్‌ మీడియా ట్వీట్లతో ట్విట్టర్‌ పోటెత్తింది. 

 

ప్రతీ పౌరుడూ సోషల్‌ మీడియా ద్వారా ఈ దుర్ఘటనపై కన్నీటి పర్యంతమవుతున్నారు. రీల్‌లో హీరో దేశం కోసం చేసే త్యాగాలు, మరణాలు చూసి వెంట్రుకలు నిక్కపొడుచుకున్న సందర్భాలెన్నో. కేవలం ఇది నటన మాత్రమే. కానీ ఈ జవానులు రియల్‌ హీరోస్‌. దేశం కోసం నిస్వార్ధంగా తమ ప్రాణాల్ని అర్పించే ఈ హీరోల రుణం తీర్చుకోలేనిది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS