దిల్‌రాజు చేయి పడితే ఆ సినిమా సూపర్‌హిట్టే అని నమ్మకం ఉండేది. కానీ ఈక్వేషన్స్ మారిపోయాయి. గతేడాది రాజుగారి ఖాతాలో ఒక్క హిట్ కూడా పడలేదు. ఏకంగా ఐదారు సినిమాలు దిల్‌రాజు బ్యానర్ నుండి వచ్చినా ఒక్కటీ సరైన సంతృప్తినిచ్చింది లేదు. తాజాగా ఆయన నిర్మాణంలో 'మహర్షి' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విషయంలో దిల్‌రాజు ధోరణి కాస్త భయపెట్టేలా ఉంది.
ఆయన నిర్మాణ భాగస్వామ్యంలో రూపొందుతోన్న 'మహర్షి' స్టోరీ విషయమై కొన్ని సంకేతాలు ఇస్తున్నారు దిల్‌రాజు. ఇదో ఎమోషనల్ డ్రామా అంటూ ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే సెంటిమెంట్ స్టోరీ అనీ, తల్లీ, తండ్రీ కొడుకు మధ్య జరిగే సెంటిమెంట్ డ్రామా అనీ ఇన్‌డైరెక్ట్‌గా సంకేతాలు పంపిస్తున్నారు. అయితే సెంటిమెంట్ మూవీలు ఇప్పుడు ఎంతవరకూ సక్సెస్ అవుతున్నాయో ఆయనకే తెలియాలి.
సెంటిమెంట్‌ని ప్రేక్షకులు అంతగా ఆదరించడం లేదిప్పుడు. ఫుల్ ఫన్ ఉంటేనే ధియేటర్స్‌కి వస్తున్నారు జనం. ఆ విషయాన్ని ఆల్రెడీ 'ఫన్ అండ్ ఫ్రస్టేషన్' ప్రూవ్ చేసింది. మరి దిల్‌రాజు మాటల్లో చెబుతున్న సెంటిమెంట్ డోస్ సినిమాలో కూడా ఎక్కువగా ఉంటే 'మహర్షి' పరిస్థితి ఏంటబ్బా.! అసలే ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. ప్రమోషన్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాలి రాజుగారూ మరి. వంశీ పైడిపల్లి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.