కరోనా నేపథ్యంలో నిర్మాతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరిశ్రమ మనుగడ సాధించాలంటే, నటీనటులు రెమ్యునరేషన్ తగ్గించుకోవాలన్న చర్చ గతంలో జరిగింది. అందుకు తగ్గట్టే పలువురు హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకునేందుకు ముందుకొచ్చినట్లు కూడా వార్తలొచ్చాయి. అయితే, ఇప్పడు సీన్ మారింది. అందాల భామలు రెమ్యునరేషన్ విషయంలో అస్సలు తగ్గట్లేదని, పైగా అదనపు డిమాండ్లను తెరపైకి తెస్తున్నారనీ సినీ పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ ప్రముఖ హీరోయిన్ రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతని చాలా ఇబ్బంది పెట్టేస్తోందట. ఆ హీరోయిన్ ఎవరు.? అన్నదానిపై మళ్ళీ భిన్న వాదనలు తెరపైకొస్తున్నాయి.
కొత్త కొత్త ప్రాజెక్టులు సెట్స్ మీదకు వెళుతుండడంతో హీరోయిన్లకు డిమాండ్ పెరుగుతోంది. కానీ, అందుబాటులో వున్న హీరోయిన్లు తక్కువగానే వున్నారు. ఆ కొరత నేపథ్యంలో వున్న ఆ కొద్దిమంది హీరోయిన్లూ రెమ్యునరేషన్ విషయంలో ‘అతి’ చేస్తున్నారంటూ పుకార్లు షికార్లు చేసేస్తున్నాయి. అయితే, ఏ హీరోయిన్‌ని ప్రశ్నించినాసరే, ‘రెమ్యునరేషన్ విషయంలో పెద్దగా అభ్యంతరాల్లేవ్..’ అనే చెబుతున్నారు. మరి, ఈ గాసిప్స్ ఎలా పుట్టకొస్తున్నయాట.? రెమ్యునరేషన్ గొడవ కారణంగానే ఓ యంగ్ స్టార్ హీరో సరసన ఛాన్స్‌ని ఓ ప్రముఖ హీరోయిన్ మిస్సయ్యిందంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత.?