పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కి సెల్యూట్ చేసింది. యంగ్ హీరోలు రామ్ చరణ్, నితిన్ ఇంకా పలువురు సినీ ప్రముఖులు వీర జవాన్లకు సెట్యూట్ చేశారు. మెగా కోడలు ఉపాసన 'ప్రౌడ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ' అని స్పందించింది. 'రివేంజ్ పై నుండి దించితే కిందకి దిగిపోయింది..' అంటూ నటుడు, దర్శకుడు వెంకీ అట్లూరి తన స్పందనను తెలియజేశాడు.
మెగా హీరో వరుణ్‌తేజ్ కూడా ఈ సర్జికల్ స్ట్రైక్‌పై స్పందించాడు. 'కంచె' సినిమాలో సైనికుడి పాత్రలో బోర్డర్‌లో యుద్ధం చేసిన వీర జవానుగా వరుణ్‌తేజ్ కనిపించిన సంగతి తెలిసిందే. ఈ విధంగా మన హీరోలు తెరపై హీరోలుగా తమ దేశభక్తిని చాటుకోవడం కోసం నటించడమే కాకుండా, ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో లైవ్‌గా కూడా తమ స్పందనను తెలియపరుస్తుండడం వారి నిజమైన దేశభక్తికి నిదర్శనం.
ఇక ఈ ప్రతీకార దాడిలో పీవోకే ఉన్న అతి పెద్ద జైషే ఉగ్రశిబిరం పూర్తిగా ధ్వంసమైందని సమాచారమ్. ఈ దాడుల్లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారనీ మీడియా వర్గాల సమాచారమ్. కార్గిల్ యుద్ధం తర్వాత భారత్ చేసిన అతిపెద్ద సర్జికల్ స్ట్రైక్ ఇదేనంటున్నారు. అందుకే మన జవాన్లకు ట్విట్టర్ వేదికగా పలువురు అభినందనల వర్షం కురిపిస్తున్నారు.