'అర్జున్‌రెడ్డి'తో తెరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ షాలినీ పాండే తొలి విజయంతో సంచలన హీరోయిన్ అనిపించుకుంది. తొలి సినిమానే అయినా, బరువైన పాత్ర పోషించి, నటిగా మంచి మార్కులు కొట్టేసింది. తర్వాత 'మహానటి'లో ఓ కీలక పాత్రలో కనిపించింది. తాజాగా కళ్యాణ్‌రామ్‌తో '118' చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో షాలినీ పాండే అల్లరి పిల్లగా కనిపించనుందట. కళ్యాణ్‌రామ్, షాలినీ పాండే మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యిందట.
ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం ఆల్రెడీ స్పష్టమైంది. స్క్రీన్‌పై ఉన్నంతసేపూ తన పాత్రకు తాను పూర్తిగా న్యాయం చేశానని షాలినీ చెప్పుకొస్తోంది షాలినీ పాండే. అంతేకాదు, తన పాత్రను చాలా జోష్‌గా డిజైన్ చేశారనీ, అది తన రియల్ లైఫ్ క్యారెక్టర్‌కి దగ్గరగా ఉందనీ చెబుతోంది ముద్దుగుమ్మ షాలినీ పాండే. షూటింగ్ తర్వాత కూడా సెట్‌లో చాలా యాక్టివ్‌గా కనిపించేదట షాలినీ పాండే. ఈ విషయాన్ని కళ్యాణ్‌రామ్ స్వయంగా ముచ్చటించారు.
ఇకపోతే ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ రోల్ పోషించింది మాత్రం ముద్దుగుమ్మ నివేదా థామస్. నివేదా పాత్ర చుట్టూనే కథ మొత్తం చక్కర్లు కొడుతుంది. నివేదా పాత్ర 118 అనే నెంబర్ చుట్టూ తిరుగుతుంటుంది. ఎప్పుడూ ప్రయోగాలకే ఓటేసే కళ్యాణ్‌రామ్ చేస్తున్న ఈ ప్రయత్నం ఈ సారైనా ఫలిస్తుందో లేదో చూడాలి మరి. మార్చి 1న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.